నాలుగు కోట్ల మందికి..నలుగురికి మధ్య కొట్లాట

ప్రధానాంశాలు

నాలుగు కోట్ల మందికి..నలుగురికి మధ్య కొట్లాట

హుజూరాబాద్‌ ఉపఎన్నికపై  మాజీమంత్రి ఈటల రాజేందర్‌

హుజూరాబాద్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: హుజూరాబాద్‌ ఉపఎన్నిక నాలుగు కోట్ల మందికి ... నలుగురు కుటుంబ సభ్యులకు మధ్య జరిగే కొట్లాట అని మాజీమంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. హుజూరాబాద్‌ మండలం పెద్దపాపయ్యపల్లి, చిన్నపాపయ్యపల్లి గ్రామాల్లో బుధవారం ఆయన భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో కలిసి ప్రచారం చేశారు.. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ అహంకారాన్ని దించాలంటే ఈ బిడ్డ అసెంబ్లీకి వెళ్లాలన్నారు. తెరాస జెండాకు ఓనర్లమని కొట్లాడితేనే హరీశ్‌రావుకు మంత్రి పదవి వచ్చిందన్నారు. ఆ  పదవి కోసం ఇప్పుడు ఆయన నోరుమూసుకున్నారన్నారు. పార్టీలో ఉన్నంతకాలం ఏ పదవి ఇచ్చినా దానికి వన్నె తెచ్చానని ఈటల తెలిపారు. డీకే అరుణ మాట్లాడుతూ రాష్ట్రంలో దొరల పాలన వచ్చిందన్నారు. బంగారు తెలంగాణ చేస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. తన కుటుంబాన్ని మాత్రం బంగారంగా మార్చుకున్నారన్నారు. ఈ ఉపఎన్నికలో భాజపా గెలుపును ఎవరూ ఆపలేరన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని