సమైక్య పాలనలో కంటే ఎక్కువ అవినీతి

ప్రధానాంశాలు

సమైక్య పాలనలో కంటే ఎక్కువ అవినీతి

కేసీఆర్‌ ప్రభుత్వంపై బండి సంజయ్‌ ధ్వజం

ఈనాడు, హైదరాబాద్‌: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌, తెదేపాల పాలన కంటే తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలోనే అవినీతి ఎక్కువగా జరుగుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడటంతో పాటు రైతులు, మహిళలు, యువతకు ఇచ్చిన హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో బుధవారం శిక్షకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్‌.కుమార్‌, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్‌రెడ్డి వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వచ్చే పరిస్థితులు ఉన్నాయని, ప్రజలకు పార్టీని మరింత చేరువ చేయాలని పిలుపునిచ్చారు.  అధికారంలో ఉన్న పార్టీలకు కొమ్ముకాయడం ఎంఐఎంకు అలవాటని, ఆ పార్టీ అవకాశవాద రాజకీయాలతోనే పాతబస్తీలో అభివృద్ధి జరగడం లేదని సంజయ్‌ విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు మంత్రి శ్రీనివాసులు, దుగ్యాల ప్రదీప్‌కుమార్‌, ప్రశిక్షణ కమిటీ కన్వీనర్‌ ఓఎస్‌ రెడ్డి హాజరయ్యారు.

గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన పొడిగింపుతో ప్రయోజనం

ఉచిత రేషన్‌ పథకం గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజనను మార్చి, 2022 వరకూ పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పేద ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని