మళ్లీ చక్రం తిప్పగలమా!

ప్రధానాంశాలు

మళ్లీ చక్రం తిప్పగలమా!

దాణా కుంభకోణంలో విచారణ ఎదుర్కొంటున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ బుధవారం పట్నా వీధుల్లో జీపు నడుపుతూ కనిపించారు. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరయ్యేందుకు నగరానికి వచ్చిన ఆయన పార్టీ కార్యకర్తలతో కలిసి ఓపెన్‌ టాప్‌ జీపు వేసుకుని చక్కర్లు కొట్టారు. ఆయనను చూసి ఆశ్చర్యానికి గురైన ప్రజలు.. లాలూ యాదవ్‌ జిందాబాద్‌ అని నినాదాలు చేశారు. ఈ వీడియోను లాలూ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘‘చాలా ఏళ్ల తర్వాత నా మొదటి వాహనం నడిపాను. జీవితం అనే ప్రయాణం కూడా సాఫీగా సాగాలి’’ అని పేర్కొన్నారు. దాణా కుంభకోణంలో జైలుకు వెళ్లిన ఆయన ఇటీవలే విడుదలయ్యారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని