మద్యం డబ్బులతో.. సంక్షేమ పథకాలా?

ప్రధానాంశాలు

మద్యం డబ్బులతో.. సంక్షేమ పథకాలా?

నెల్లూరులో బాధితులకు చంద్రబాబు పరామర్శ

చంద్రబాబునాయుడుకు తన ఇంట్లో పరిస్థితిని వివరిస్తున్న గంగపట్నం గ్రామ మహిళ

ఇందుకూరుపేట, న్యూస్‌టుడే: ‘మద్యం తాగిన డబ్బుతో వచ్చే ఆదాయంతో.. సంక్షేమ పథకాలు అమలు చేయడమేంటి? నాన్న తాగితే పిల్లలకు అమ్మఒడి రావడమేంటి? పింఛన్లు ఇవ్వడమేంటి? ప్రజలను కష్టపెట్టేందుకు జగన్‌.. ఇలాంటి కొత్త స్కీములు మరెన్నో తెస్తాడు. వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి’ అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. శనివారం ఆయన నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని రాపూరు, గంగపట్నం గ్రామాల్లో, నెల్లూరు నగరంలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. గంగపట్నంలో కొట్టుకుపోయిన చెరువు కట్టలను, దెబ్బతిన్న ఇళ్లు, ఆక్వా చెరువులను పరిశీలించారు. బాధితుల ఇళ్లలోకి వెళ్లి పలకరించారు. ఇళ్లన్నీ వరదకు బురదమయమయ్యాయని మహిళలు విలపించగా.. నేనున్నానని భరోసా ఇచ్చారు. ఇసుక తవ్వకాల కోసమే సోమశిల నుంచి దిగువకు నీళ్లు వదలకుండా ప్రజల ప్రాణాలు పణంగా పెట్టారని ఆరోపించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని