ఆత్మరక్షణ వద్దు..రాజకీయంగా దూకుడే!

ప్రధానాంశాలు

ఆత్మరక్షణ వద్దు..రాజకీయంగా దూకుడే!

ఆరు జిల్లాల భాజపా అధ్యక్షులతో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌లో గురువారం ‘మీరూ శాసనాలు చదవొచ్చు’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి.

చిత్రంలో ప్రకాశ్‌రెడ్డి, విజయ్‌భాస్కర్‌, చంద్రశేఖర్‌, అరుణకుమారి, రచయిత శివనాగిరెడ్డి, రాజాసింగ్‌, లక్ష్మీకాంతరెడ్డి, రామచంద్రమూర్తి, రామోజు హరగోపాల్‌

ఈనాడు, హైదరాబాద్‌: ప్రత్యర్థి పార్టీల వారు ఆరోపణలు, విమర్శలు చేశాక ఆత్మరక్షణ ధోరణితో వ్యవహరించడానికి బదులు వారిపై ముందే రాజకీయంగా దూకుడుగా వెళ్లాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి భాజపా నేతలకు సూచించారు. ప్రజాసమస్యలపై పోరాటాలు చేస్తూనే వాటిని ఓట్లుగా మలుచుకోవాలన్నారు. పార్టీ హైదరాబాద్‌ సెంట్రల్‌, మహంకాళి, భాగ్యనగర్‌, గోల్కొండ, రంగారెడ్డి, మేడ్చల్‌ అర్బన్‌ జిల్లాల అధ్యక్షులు, ఇన్‌ఛార్జులు, ప్రధాన కార్యదర్శులతో గురువారం  ఆయన సమావేశమయ్యారు. పార్టీ ప్రధానకార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్‌, రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్‌రెడ్డి, సీనియర్‌నేత నాగూరావ్‌ నామాజీతో కలిసి హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో పార్టీ బలోపేతంపై చర్చించారు. ఆరు జిల్లాల మధ్య సమన్వయానికి కమిటీ ఏర్పాటు చేసుకోవాలని, కార్పొరేటర్లతో కలిసి ప్రజాసమస్యలపై ఉద్యమాలు చేయాలని సూచించారు. కార్పొరేటర్లు సహా నాయకులు తమపై ఇసుమంతైనా అవినీతి ఆరోపణలు రాకుండా వ్యవహరించాలన్నారు. ‘ప్రజలకోసం ఉద్యమాలు చేస్తున్నాం, అరెస్టు అవుతున్నాం. ఎన్నికల్లో కొన్నిచోట్ల తక్కువ ఓట్లతో ఓడిపోతున్నాం. మన మద్దతుదారులకు ఓట్లు లేకపోవడం, ఉన్నా ప్రత్యర్థులు తొలగించడం వల్ల నష్టపోతున్నాం. మన అసలు లక్ష్యం కొత్త ఓటర్ల నమోదు. దీనికి ప్రాధాన్యమివ్వాలి. అప్పుడే చట్టసభల్లో పార్టీ బలం పెరుగుతుంది’ అని పేర్కొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని