త్వరలో నిర్ణయం ప్రకటిస్తా..!
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

త్వరలో నిర్ణయం ప్రకటిస్తా..!

 ఆత్మగౌరవమే అసలు సమస్య
 మాజీ మంత్రి ఈటల రాజేందర్‌

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌: హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలతోపాటు విదేశాల్లో ఉన్న ఎన్‌ఆర్‌ఐలు, పలు జిల్లాల అభిమానులు తనకు జరిగిన అన్యాయంపై ఆవేదనను వ్యక్తం చేస్తున్నారని, హైదరాబాద్‌లో ఉన్న కొంతమంది శ్రేయోభిలాషులు, రాజకీయవేత్తల్ని సంప్రదించి త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తానని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. బుధవారం తన నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలతో చర్చించిన అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గంలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, సర్పంచులు ఇతర ప్రజాప్రతినిధులు, కరీంనగర్‌తోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన ప్రజలు వారి అభిప్రాయాలను తెలిపారని ఈటల చెప్పారు. తనకు పార్టీ బీ-ఫారం ఇస్తే , హుజూరాబాద్‌ నుంచి తెలంగాణ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తం చేయగలిగామని పేర్కొన్నారు. ఉప్పల్‌ రైల్వేస్టేషన్‌లో కాల్పులకు ఆదేశాలిచ్చినా భయపడకుండా మిలిటెంట్‌ తరహాలో ఉద్యమ సెగను దిల్లీకి తాకించామని అన్నారు. ‘ప్రత్యక్షంగా ఆ ఉద్యమాల్లో పాల్గొన్న ప్రజలంతా వారి బాధను వినిపించారు. వారంతా నాకు జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నార’ని ఈటల పేర్కొన్నారు. తన నిర్ణయానికి వారంతా కట్టుబడతామని హామీ ఇచ్చారని తెలిపారు. మీలాంటి వాళ్లకే ఇలాంటి కష్టం వస్తే మామూలు వాళ్ల పరిస్థితి ఏంటని పలువురు కన్నీళ్లు పెట్టుకుని ఆవేదనను వ్యక్తం చేశారని చెప్పారు. తెలంగాణ ప్రజలు ఏం కోరుకున్నారో.. ఏం ఆశిస్తున్నరో అనేది ఆలోచిస్తే ఆత్మగౌరవ సమస్య అనేది పెద్దదిగా కనిపిస్తోందని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు