మాపై అక్రమంగా కేసులు పెట్టారు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మాపై అక్రమంగా కేసులు పెట్టారు

ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్‌ వెంకట్‌

ఈనాడు, హైదరాబాద్‌: మంత్రి మల్లారెడ్డి వైద్య ఆసుపత్రి వద్ద నిరసనకు పాల్పడిన తమపై అక్రమంగా కేసులు పెట్టారని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్‌ వెంకట్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆందోళన సందర్భంగా వైద్యులపై తాము దాడికి పాల్పడలేదని స్పష్టం చేశారు. మంత్రి అక్రమంగా ఆసుపత్రి, భవనాలు నిర్మించారంటూ నిరసన తెలిపినట్లు చెప్పారు. తమ వల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదని తాము పీపీఈ కిట్లు ధరించి ఆసుపత్రి ఎదుటకు వెళ్లామన్నారు. అక్కడి వైద్యుల సూచనలను గౌరవించి గేటు వద్ద నిరసన వ్యక్తం చేశామని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి వ్యక్తిగత, ఆసుపత్రి భద్రతా సిబ్బంది తమపైనే దాడి చేశారన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు