ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ లేఖ
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ లేఖ

ఈనాడు, దిల్లీ: ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వృద్ధాప్య పింఛనును రూ.2,750కు పెంచాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు లేఖ రాశారు. వృద్ధాప్య పింఛనును ఏటా రూ.250 చొప్పున పెంచుతూ రూ.2 వేల నుంచి రూ.3 వేలు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చామని గుర్తు చేశారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేశాక రూ.2,250కు పింఛను పెంచారని పేర్కొన్నారు. 2020 మే నెలాఖరు నుంచి రూ.2,500, 2021 జూన్‌ నుంచి రూ.2,750 ఇవ్వాల్సి ఉందని తెలిపారు. గతంలో పెంచకుండా బకాయిపెట్టిన మొత్తం రూ.3 వేలను పింఛనుదారులకు అందేలా చూడాలని కోరారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు