పేదల భూములు.. పెద్దలకు ఇచ్చేందుకే వేలం: నారాయణ
close

ప్రధానాంశాలు

పేదల భూములు.. పెద్దలకు ఇచ్చేందుకే వేలం: నారాయణ

సంస్థాన్‌నారాయణపురం, న్యూస్‌టుడే: పేదల అవసరాలు తీర్చాల్సిన భూములను అడ్డగోలుగా పెద్దలకు అప్పజెప్పేందుకు తెరాస ప్రభుత్వం వేలం ప్రకటన తీసుకొచ్చిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌ నుంచి రోడ్డుమార్గంలో నల్గొండకు వెళ్తూ మధ్యలో యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండల కేంద్రంలో ఆయన ఆగారు. పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలనే దురుద్దేశంతో సీఎం కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాచకొండ రైతుల భూ సమస్యలు పరిష్కరించి వారికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని