పిస్టన్ రింగ్ చప్పుడు..

శబ్దం: పిస్టన్ నుంచి క్లిక్క్లిక్మని చప్పుడు కారణం: పిస్టన్కి పైన మూణ్నాలుగు రకాల రింగ్‌లు ఉంటాయి. ఇంజిన్ ఆయిల్ కంబషన్ ఛాంబర్లోకి రాకుండా, కంబషన్ ఛాంబర్లో ఉండే గ్యాస్‌లు క్రాంక్కేస్లోకి వెళ్లకుండా ఇవి పని చేస్తాయి. ఇంధనం, ఆయిల్ కలవకుండా చూడటం వీటి పని. ఇవి చెడిపోతే యాక్సిలరేషన్ ఇచ్చినప్పుడు క్లిక్క్లిక్మని చప్పుడు వస్తుంటుంది. సిలిండర్ గోడలు అరిగినా, పిస్టన్ రింగ్‌లు పగిలినా, లో రింగ్ టెన్షన్ అయినా ఇలాంటి శబ్దం వస్తుంది.
|
పిస్టన్ని చరిచినట్టు..

శబ్దం: హోరున గాలి వీచినట్టు, స్టీల్ బాటిల్ తీసుకొని దాన్నొక స్టీల్ గ్లాసులో పెట్టి ఆపకుండా కొడితే ఎలా శబ్దం వస్తుందో అలా... కారణం: సిలిండర్‌లో ఉండే పిస్టన్ పైకి, కిందికి నిరంతరం కదులుతూ ఉంటుంది. ఈ ప్రక్రియ సాఫీగా సాగడానికి పిస్టన్, సిలిండర్ గోడల మధ్య కొంచెం దూరం ఉంటుంది. దీంట్లో హెచ్చుతగ్గులు వస్తే పిస్టన్ సిలిండర్ గోడలను తాకుతూ ఉంటుంది. దీన్నే పిస్టన్ స్లాప్ అంటారు. అరిగిపోయిన, చెడిపోయిన సిలిండర్లు.. ఆయిల్ తగినంత లేకపోవడం ఈ సమస్యకు కారణాలు.
|
కనెక్టింగ్ రాడ్‌లో..

శబ్దం: తలుపు తట్టినట్టు, కొన్నిసార్లు గట్టిగా కొట్టినట్టు కారణం: పిస్టన్, క్రాంక్షాఫ్ట్ని అనుసంధానించేది కనెక్టింగ్ రాడ్. ఇది చెడిపోయినా, రాడ్ అలైన్మెంట్ సరిగా లేకపోయినా ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. ఆయిల్ లూబ్రికేషన్ తగినంతగా లేకపోవడం, బేరింగ్లు అరిగిపోవడం, క్రాంక్పిన్లు చిరిగిపోవడమూ ఈ శబ్దానికి కారణాలు.
|
వాల్వ్ట్రెయిన్ లోపల

శబ్దం: ఇంజిన్ స్టార్ట్ చేసిన తర్వాత తక్కువ వేగంలో ఉన్నప్పుడు ఈ వాల్వ్ట్రెయిన్ నుంచి ఆగకుండా క్లికింగ్ శబ్దం వస్తుంటుంది. కారణం: వెహికిల్ కంబషన్ ఛాంబర్లోని సిలిండర్ లోపల గాలి, ఇంధనం కలిసిపోయి వెళ్లడానికి కొన్ని వాల్వ్‌లు ఉంటాయి. ఈ వాల్వ్‌లను నియంత్రించేదే వాల్వ్ట్రెయిన్. ఇవి చెడిపోయినా, లిఫ్టర్లో ఏదైనా లోపం ఏర్పడినా ఈ శబ్దం వస్తుంది.
|
పేలుడు శబ్దం..

చప్పుడు: ఇంజిన్ లోపల ఏదో వస్తువు పేలుతున్నట్టు ఒక్కసారిగా శబ్దం వస్తుంది. కారణం: ఒక నిర్ణీత పద్ధతిలో, కచ్చితమైన సమయంలో ఇంధనం, గాలి కలిసినప్పుడు ఇంధనం మండి శక్తి వెలువడుతుంది. దాని ద్వారా బండి కదులుతుంది. అలాకాకుండా సమయానికి ముందే ఎయిర్/ఫ్యుయెల్ సమ్మిళితమైతే ఇలా పేలుడు శబ్దం వస్తుంటుంది. ఇంధనంలో కల్తీ, తక్కువ యాక్టేన్ ఇంధనం వాడటం.. ఈ సమస్యకి కారణాలు.
|
క్రాంక్‌షాఫ్ట్ తట్టినట్టు..

శబ్దం: ఒక రాడ్డు తీసుకొని ఒక రంధ్రంలో పెట్టి కిందాపైనా కొడితే ఎలాంటి శబ్దం వస్తుందో అలా. కారణం: క్రాంక్ కేస్‌లో క్రాంక్‌షాఫ్ట్ ఉంటుంది. పిస్టన్ నుంచి చక్రానికి శక్తి బదిలీ చేయడమే క్రాంక్‌షాఫ్ట్ పని. ఈ క్రమంలో ప్రతి దశలో కేస్కి, కనెక్టింగ్ రాడ్కీ మధ్యలో ప్రతిచోటా ఒక బేరింగ్ ఉంటుంది. ఇవి విరిగినా, అరిగినా శబ్దం మొదలవుతుంది.
|
పిస్టన్ పిన్ నుంచి..

శబ్దం: లోహంపై రెండుసార్లు టక్‌టక్‌మని కొట్టినట్టు కారణం: పిస్టన్, కనెక్టింగ్ రాడ్‌ని కలపడానికి ఉపయోగించేది పిస్టన్ పిన్. ఇంజిన్ ఆన్ చేసిన తర్వాత ఇది పైకీకిందికీ, కుడిఎడమలకు కదులుతూ ఉంటుంది. ఈ పిస్టన్ పిన్ పూర్తిగా అరిగిపోయినా, వదులు అయినా ఇలా సౌండ్ వస్తుంది. లోపల ఉండే బుష్‌లు అరిగినా, చిరిగినా, తగినంత ఆయిల్ దీనికి అందకపోయినా ఈ సమస్య పునరావృతం అవుతుంది. ఇంజిన్ స్టార్ట్ చేసిన తర్వాత కారు వేగం ఇంకా అందుకోక ముందే ఏదైనా లోహాన్ని వెనువెంటనే రెండుసార్లు టక్ టక్మని కొట్టినట్టు చప్పుడు వస్తుంది.
|