తొలి ఎస్యూవీ కోనా
తొలి స్పోర్ట్ యుటిలిటీ ఎలక్ట్రిక్ వాహనం... అత్యాధునిక ఫీచర్లు.. భారీ ఛార్జింగ్ రేంజ్...ఈమధ్యే విడుదలైన హ్యుందాయ్ కోనా ప్రత్యేకతలు...మిగతా ఫీచర్లు వివరంగా.

* 4.2మీటర్ల పొడవు, 1.8మీటర్ల వెడల్పుతో క్రెటా మోడల్‌కన్నా పెద్దగా ఉంటుంది. * 9.7సెకన్లలో వంద కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. * పెట్రోల్/డీజిల్ కార్లతో పోలిస్తే ఇంధనానికయ్యే ఖర్చు ఎనభైశాతం తక్కువ. * పదకొండు నగరాల్లో పద్నాలుగు డీలర్ల దగ్గర లభిస్తోంది. పోటీదారు: ఆడీ ఈ-ట్రాన్, ఎంజీ ఈజడ్ఎస్. * లిథియం-అయాన్ బ్యాటరీకి ఎనిమిదేళ్లు, లక్షా అరవై వేల కిలోమీటర్ల వరకు వారంటీనిస్తున్నారు. * ఈ వాహనాన్ని అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా, కొరియా మార్కెట్లోకి ఎగుమతి చేయబోతున్నారు. ధర: రూ.25.30 లక్షలు (ఎక్స్ షోరూం) భారీ రేంజ్: ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ కార్లతో పోలిస్తే కోనా ఛార్జింగ్ రేంజ్ చాలా ఎక్కువ. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 452 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ప్రపంచంలోని అత్యుత్తమ లాంగ్ రేంజ్ ఎస్యూవీ అనదగ్గ నిస్సాన్ లీఫ్‌తో ఇది పోటీ పడుతోంది. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (అరాయ్) దీన్ని ధ్రువీకరించింది. అయినా కేవలం 57 నిమిషాల్లోనే బ్యాటరీ 80శాతం ఛార్జింగ్ అవుతుంది. ఇంజిన్: 39కిలోవాట్ల అత్యాధునిక లిథియం పాలిమర్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తోంది. 134పీఎస్ సామర్థ్యం దీని సొంతం. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో పని చేస్తుంది. ఇంట్లోనే ఛార్జింగ్ చేసుకునేలా హోం ఛార్జింగ్ యాక్సెసరీని కారుతో పాటు అందిస్తున్నారు. ఫీచర్లు: పొడవాటి విశాలమైన గ్రిల్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, హెడ్అప్ డిస్ప్లే, వెంటిలేషన్ సీట్లు, ఎనిమిది అంగుళాల తాకే తెర, ఎనిమిది స్పీకర్ల ఆడియో సిస్టమ్ కొన్ని ఫీచర్లు. నలుపురంగు సైడ్ క్లాడింగ్‌లు, స్లిమ్ ఎల్ఈడీ డీఆర్ఎల్లు, క్యాబిన్లో నాణ్యమైన మెటీరియల్స్‌తో రూపొందించిన క్యాబిన్.. ఎస్యూవీ హంగులద్దాయి. భద్రత: ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్సీ, రేయర్ కెమెరా, ఐఎస్ఓఎఫ్ఐఎక్స్.
|