అదనపు హంగులతో: టాటా ఆల్ట్రోజ్

విభాగం: ప్రీమియం హ్యాచ్‌బాక్ ప్రత్యేకతలు: చురుకుదనం, వేగం, సామర్థ్యంలో మిన్నగా ఉండే అల్బెట్రాస్ పక్షి స్ఫూర్తితో రూపొందించారు. ఎజైల్ లైట్ ఫ్లెక్సిబుల్ అడ్వాన్స్డ్ ఆర్కిటెక్చర్ టెక్నాలజీ (అల్ఫా) ప్లాట్‌ఫాం. 1.2లీ పెట్రోల్, 1.5లీ డీజిల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. విడుదల: ఆగస్టు 2019 ధర: రూ.8.5 లక్షలు
|
సూపర్ రైడర్లకి: డుకాటీ డయావెల్ 1260

విభాగం: క్రూజర్, సూపర్‌బైక్ సాంకేతికాంశాలు: 1262సీసీ, ట్విన్ సిలిండర్, 157.7పీఎస్ జీ్ 9250ఆర్పీఎం. దృఢమైన టుబ్యులర్ స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్‌తో వస్తోంది. విడుదల: ఆగస్టు 2019 ధర: రూ.18లక్షలు
|
లగ్జరీ ప్రియులకు: ఆడీ క్యూ8

విభాగం: కూపే-ఎస్యూవీ విడుదల: ఆగస్టు 2019 సాంకేతికాంశాలు: 3.0లీటర్ల వీ6 టీడీఐ ఇంజిన్, 286బీహెచ్పీ, 8స్పీడ్ టిప్ట్రోనిక్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ‘మై ఆడీ’ యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు. ధర: రూ.90లక్షలు
|
పర్యావరణ హితులకు: హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా హెచ్ఎస్500 ఈఆర్

విభాగం: ఎలక్ట్రిక్ స్కూటీ ప్రత్యేకతలు: 600-1300 వాట్ల మోటార్ పవర్. 5గంటల్లో బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. 110కిలోమీటర్ల రేంజ్. విడుదల: ఆగస్టు 2019 ధర: రూ. 65వేలు
|
కొత్త దూకుడు: కియా సెల్టోజ్

విభాగం: ఎస్యూవీ ప్రత్యేకతలు: ఎనిమిది వేరియంట్లలో వస్తోంది. 1.5లీటర్ల టర్బో జీడీఐ పెట్రోల్ మానిటర్, 115పీఎస్, 6స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, సీవీటీతో పని చేస్తుంది. విడుదల: ఆగస్టు 22, 2019 ధర: రూ.12లక్షలు
|