జాగ్వార్ ఈ-టైప్

గతేడాది సెప్టెంబరులోనే ఈ కారుకు సంబంధించి సమాచారం అధికారికంగా బయటికొచ్చింది. జాగ్వార్ కంపెనీకి చెందిన ‘క్లాసిక్’ మోడల్ ఇంజిన్‌ను అమర్చబోతున్నారు. 40 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో పని చేస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 170 మైళ్లు ప్రయాణిస్తుంది. విడుదల: 2020 ఫిబ్రవరి
|
పోర్షే మిషన్ ఈ

ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 480 కిలోమీటర్ల ప్రయాణం. మేం సాధ్యం చేసి చూపిస్తాం అంటోంది పోర్షే కంపెనీ. ఈ ప్రాజెక్టుకి మిషన్ ఈ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కారు అని పేరు పెట్టారు. రెండు మోటార్లతో నడిచే ఈ కారు 440 కిలోవాట్ల (దాదాపు 600హెచ్‌పీకి సమానం) విద్యుత్తు బ్యాటరీతో నడుస్తుంది. కేవలం 15 నిమిషాల ఛార్జింగ్‌తో 250 మైళ్లు ప్రయాణం చేయొచ్చు. డ్రైవరు చుట్టూ అమర్చిన ఐదు ఓఎల్ఈడీ ప్యానెళ్లు డ్రైవరు ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఎప్పటికప్పుడు సలహాలిస్తుంటాయి. విడుదల: తేదీ ప్రకటించలేదు
|
బీఎండబ్ల్యూ ఐ8 రోడ్‌స్టర్

సూపర్‌కారు పోటీలోకి అందరికంటే ముందే దిగిన కంపెనీ ఐ8 రోడ్‌స్టర్. హైబ్రిడ్ సింక్రోనస్ మోటార్ మరియు మూడు సిలిండర్ల గ్యాసోలిన్ ఇంజిన్ (పెట్రోల్) ఇంజిన్‌తో పని చేస్తుంది. తర్వాత దీన్నే మెల్లిగా ఎలక్ట్రిక్ రేంజ్‌కి మార్చుతారు. విడుదల: 2019 చివర్లో
|
ఫెరారీ ఎలక్ట్రిక్ సూపర్‌కార్

ఈ సూపర్కారుకి ఇంకా పేరు పెట్టకపోయినా పరిశోధన మాత్రం జోరుగా సాగుతోంది. ఫెరారీ సీఈవో సెర్జియో మార్షియోన్నె టెస్లా కంపెనీ సూపర్‌కారు రోడ్‌స్టర్ కన్నా ముందే 2020లో రోడ్డెక్కుతాం అని నార్త్ అమెరికన్ ఇంటర్నేషనల్ ఆటో షోలో చెప్పుకొచ్చాడు. డిజైన్, ఇతర ఫీచర్లకు సంబంధించి వివరాలు బయటికి వెల్లడించడం లేదు. విడుదల: 2020 ఏప్రిల్
|
మెర్సిడెస్ బెంజ్ ఈక్యూ సిల్వర్

1937లో విడుదలైన డబ్ల్యూ 125 మోడల్ స్ఫూర్తితో ఈ బ్యాటరీ సూపర్ కారు తయారు చేస్తున్నారు. మానెటరీ కార్ వీక్‌లో తొలిసారి నమూనా కారు ప్రదర్శించారు. 80 కిలోవాట్ల బ్యాటరీ 400 కిలోమీటర్ల రేంజ్నిస్తుంది. సింగిల్ సీటర్ కాక్పిట్లా ఉంటుంది. విడుదల: 2019 చివర్లో లేదా 2020 తొలి అర్థభాగంలో
|