రెండుచోట్లా టాప్

మోడల్: ఫోర్డ్ ఎకోస్పోర్ట్ తయారీకేంద్రం: చెన్నై ఎన్నిదేశాలకు: అరవైకిపైగా యూనిట్లు: 91వేలు భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న స్పోర్ట్ యుటిలిటీ వాహనాల్లో ఒకటి ఫోర్డ్ ఎకోస్పోర్ట్. ఇంట గెల్చిన ఈ వాహనం విదేశాల్లోనూ రచ్చ చేస్తోంది. ఏడాదికి యాభైశాతం చొప్పున ఎగుమతులు వృద్ధి చెందుతున్నాయి. ఈ అమెరికా కంపెనీ అమ్మకాలు లాటిన్ అమెరికా, యూరోప్‌ల్లో ఎక్కువగా ఉన్నాయి. 2017లో భారత్ నుంచి అత్యధికంగా ఎగుమతైన మోడల్ ఇది.
జోరుకు కారణం * వ్యాపార నిర్వహణ, విస్తరణకు సానుకూల వాతావరణం * తయారీ కేంద్రాలకు ప్రభుత్వం ఇచ్చే రాయితీలు. మేక్ ఇన్ ఇండియాలాంటి కార్యక్రమాలు * దేశం నలుమూలలా ఉన్న నౌకాశ్రయాలు. చకన్, గురుగ్రామ్, సనంద్, ఒరగదంలాంటి ఆటోమొబైల్ హబ్‌లతో అనుసంధానమైన రవాణా వ్యవస్థ * సాంకేతిక పరిజ్ఞానానికి కొదవ లేదు. తక్కువ వేతనాలకే పనిచేసే సుశిక్షితులైన మానవ వనరులు * మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లను తయారు చేస్తున్న పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు * ఆటోమొబైల్ తయారీ కేంద్రాలైన థాయ్‌లాండ్, దక్షిణామెరికాల్లో వాహన తయారీ ఖర్చులు పెరుగుతుండటం.
|
ఆరేళ్ల కింద మొదలైన హవా

మోడల్: ఫోక్స్‌వాగన్ వెంటో తయారీ కేంద్రం: చకన్ (మహారాష్ట్ర) ఎన్ని దేశాలకు ఎగుమతి: 80కి పైగా యూనిట్లు: 77వేలు వెంటో మోడల్ ఇక్కడ పెద్దగా అమ్ముడుకాకపోవచ్చుగాక.. మెక్సికోలో అత్యధికంగా ఉపయోగిస్తున్న కార్లలో దీనిది మూడోస్థానం. ఆ ఒక్క దేశానికే ఇప్పటికి రెండులక్షల ఎనభైవేల కార్లు ఎగుమతయ్యాయి. ఆరేళ్ల కిందట తొలిసారి దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టింది. అప్పట్నుంచి అమ్మకాలు ఏడాదికి పదమూడుశాతం చొప్పున పెరుగుతున్నాయి.
|
విదేశాల్లో హవా

మోడల్: రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ తయారీ: చెన్నై ఎగుమతయ్యే దేశాలు: 62 రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాల్లో ఐదారేళ్లలో టాప్‌గేర్‌లో దూసుకెళ్తోంది. ఈ జోరు దేశీయంగానే కాదు ఎగుమతుల్లోనూ కనిపిస్తోంది. బ్రిటన్‌లో చాలామంది మెచ్చిన బైక్ ఇది. మొత్తానికి అరవైరెండు దేశాల్లో పరుగులు పెడుతోంది. ఈశాన్య ఆసియా, ఉత్తర అమెరికాల్లోనూ గిరాకీ ఎక్కువే.
|
ఇదే నెంబర్‌వన్

మోడల్: బజాజ్ బాక్సర్ 100 తయారీ కేంద్రం: ఔరంగాబాద్ ఎగుమతయ్యే దేశాలు: యాభైకిపైగా బజాజ్ బాక్సర్.. ఈ బైక్ పేరు వినుండొచ్చుగానీ మన దగ్గర కనిపించడం అరుదే. కానీ హోండా యాక్టివా, హీరో స్ల్పెండర్లాంటి అత్యధిక అమ్మకాల వాహనాల్ని తోసిరాజని విదేశాల్లో గిరాకీ సంపాదించుకుంది. ముఖ్యంగా లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాల్లో ఇది హాట్‌కేక్‌లా అమ్ముడవుతోంది. ఇప్పటివరకు మూడున్నర లక్షలు దేశం దాటాయి.
|
బీట్ చేసేదెవరు?

మోడల్: షెవర్లే బీట్ తయారీ కేంద్రం: పుణె, ఎగుమతి యూనిట్లు: 84వేలు ఎగుమతయ్యే దేశాలు: చిలీ, పెరూ, అర్జెంటీనా, మధ్య అమెరికాలతోపాటు యాభైకి పైగా ఈమధ్యే షెవర్లే ఇండియాలో అమ్మకాలు నిలిపేసింది. ఉత్పత్తి మాత్రం ఆపలేదు. పుణె దగ్గర్లోని టాలెగావ్లో తయారవుతున్న బీట్ కార్లు మారుతీ, హ్యుందాయ్, హోండాలాంటి దేశీయంగా అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లను వెనక్కి తోసి మరీ ఎక్కువగా ఎగుమతి చేస్తోంది.
|
ఐరోపాలో మేటి

మోడల్: నిస్సాన్ మైక్రా తయారీ కేంద్రం: చెన్నై ఎన్నిదేశాలకు ఎగుమతి?: వందకుపైగా యూనిట్లు: 52వేలు దేశంలో మైక్రా పెద్దగా కనపడకపోవచ్చుగానీ ఈ మేడ్ ఇన్ చెన్నై కార్లు విదేశాల్లో దుమ్ము దులుపుతున్నాయి. ఐరోపాలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఆసియా కారుగా దీనికి రికార్డు ఉంది. ఇప్పటికి ఏడున్నర లక్షల కార్లు ఇక్కడినుంచి బయటికి వెళ్ల్లాయి. 2016లో ఇండియా నుంచి అత్యధికంగా విదేశాలకు ఎగుమతి అయినా మోడల్‌గా రికార్డు సృష్టించింది.
|
హీరోలా దూసుకెళ్తోంది

మోడల్: హీరో మోటోకార్ప్ స్ల్పెండర్ తయారీ: హరిద్వార్, సత్యవేడు, గురుగ్రామ్ ఎగుమతయ్యే దేశాలు: శ్రీలంక, బంగ్లాదేశ్, కొలంబియా, నేపాల్, లాటిన్ అమెరికా, మధ్యప్రాశ్య్చం మంచి మైలేజీ, ఆకట్టుకునే రూపం స్ల్పెండర్ సొంతం. సరిగ్గా ఈ ఫీచర్లే పొరుగుదేశాలను ఆకర్షించాయి. హీరో కంపెనీ ఎగుమతులు పరుగులు తీస్తున్నాయి. తయారీ కేంద్రాలు దేశమంతా ఉండటంతో రవాణాకు అనుకూలంగా ఉంది.
|
అక్కడా.. ఇక్కడా

మోడల్: హ్యుందాయ్ క్రెటా తయారీ కేంద్రం: చెన్నై యూనిట్లు: 51వేలు ఎగుమతయ్యే దేశాలు: భారత్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే రెండో కార్ల కంపెనీ హ్యుందాయ్. ఇక్కడ అత్యధికంగా అమ్ముడవడమే కాదు.. భారత్‌లో తయారై అత్యధికంగా విదేశాలకు ఎగుమతి చేస్తున్న కంపెనీల్లో ముందుంది. ఇక్కడే గిరాకీ ఎక్కువగా ఉండటంతో గతేడాది అమ్మకాల్లో కొంచెం వృద్ధి తగ్గింది.
|
భారత్ ప్రపంచ కేంద్రం
ఆటోమొబైల్ తయారీ, ఎగుమతులకు భారత్ త్వరలోనే ప్రపంచకేంద్రం కాబోతోంది. హ్యుందాయ్తోపాటు నిస్సాన్, ఫోర్డ్లాంటి ప్రపంచస్థాయి విదేశీ కంపెనీలు ఇండియాను తయారీ కేంద్రంగా ఎంచుకున్నాయి. పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయి. మారుతీ, టాటా మోటార్స్, టీవీఎస్లాంటి దేశీయ కంపెనీలూ పెద్దస్థాయిలో వాహనాల్ని ఎగుమతి చేస్తున్నాయి. తక్కువ వేతనాలకే పని చేసే నిపుణులు, మంచి మౌలిక సదుపాయాలు, ప్రభుత్వం ప్రోత్సాహం, ప్రపంచంలో ఏ మూలకైనా చేరగల రవాణా సౌకర్యాలు.. విదేశీ కంపెనీలు ఇక్కడ తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి కారణం. మన దగ్గర ఉత్పత్తయ్యే వాహనాలకు పొరుగుదేశాలతోపాటు మధ్యప్రాశ్చ్యం, దక్షిణ అమెరికా, యూరోప్‌ల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. అక్కడికి ఎగుమతి చేయడానికి దేశంలో చాలావరకు నౌకాశ్రయాలు అందుబాటులో ఉన్నాయి. ఇయాన్, గ్రాండ్ ఐ10, ఐ20, యాక్సెంట్, క్రెటా, వెర్నా.. మోడళ్లను ఇక్కడినుంచే 88 దేశాలకు ఎగుమతి చేస్తున్నాం.
- రాకేశ్ శ్రీవాత్సవ, డైరెక్టర్: సేల్స్ అండ్ మార్కెటింగ్ హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్
|