close
మిరపలో తెగుళ్ల నివారణ

న్యూస్‌టుడే, ఖమ్మం (వ్యవసాయం) 

మిరపను తెగుళ్లు ఆశించి నష్టం కలిగిస్తున్నందున, రైతులు సకాలంలో నివారణ చర్యలు పాటించాలని ఖమ్మం చ్కీజిజిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కోఆర్డినేటర్‌ డాక్టర్‌ జే.హేమంత్‌కుమార్, శాస్త్రవేత్తలు డాక్టర్‌ కె.రవికుమార్, డాక్టర్‌ పి.శీరంజిత, డి.నాగరాజు తెలిపారు. 

బూడిద తెగులు: ఈ తెగులాశించిన భాగంలో ఆకుపచ్చరంగు పోయి కింది భాగంలో తెల్లటి బూడిదలాంటి మచ్చలు ఏర్పడతాయి. తెగులు ఉధృతంగా ఉంటే.. పూత, కాయలపై బూడిద మచ్చలు ఏర్పడతాయి. తెగులాశించిన ఆకులు పండుబారుతాయి. పూత, పిందె రాలిపోతుంది. నివారణకు.. లీటరు నీటికి, నీటిలో కరిగే గంధకం 3 గ్రా. లేదా డైనోక్యాప్‌ ఒక మి.లీ. కలిపి చెట్లపై పిచికారి చేయాలి. 

మొవ్వు కుళ్లు తెగులు (పీనట్‌ బడ్‌ నెక్రోసిస్‌ వైరస్‌): ఈ తెగులాశించిన మొక్కల చిగుర్లు ఎండిపోతాయి. కాండంపై నల్లని నిర్దిష్ట ఆకారం లేని మచ్చలు ఏర్పడి క్రమేణా చారలుగా మారతాయి. ఆకులపై వలయాలుగా  మచ్చలు ఏర్పడి పండుబారి రాలిపోతాయి. ఈ తెగులు తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. 

వేరుకుళ్లు/ఎండు తెగులు: ఈ తెగుళ్లు ఆశించినప్పుడు మొక్కలు వడలి, ఎండిపోతాయి. పూత, పిందె, ఆకులు రాలిపోతాయి. నివారణకు.. లీటరు నీటికి 3 గ్రా. కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ కలిపిన ద్రావణాన్ని మొక్కల మొదళ్ల దగ్గర పోయాలి. 

సమగ్ర నివారణ చర్యల్లో భాగంగా.. 90 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేపపిండి, 2 కిలోల ట్రైకోడెర్మావిరిడి కలిపి వృద్ధి చేసి, మిరప సాళ్లలో వేయాలి. ఈ తెగుళ్ల సమస్య ఎక్కువగా ఉన్న పొలాల్లో జొన్న, మొక్కజొన్నతో పంటమార్పిడి చేయాలి. 

బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు: ఆకులపై గోధుమరంగు మచ్చలు ఏర్పడి, క్రమేపి పెద్దవిగా మారుతాయి. వీటి నుంచి చ్కీజిజిగురులాంటి పదార్థం వచ్చి నల్లటి పొడ ఏర్పడుతుంది. ఆకులు పండుబారుతాయి. నివారణకు.. 10 లీటర్ల నీటికి కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ 30 గ్రా. + ఒక గ్రా. స్ట్రెప్టోసైక్లిన్‌ కలిపి 10-15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.               

వైరస్‌ తెగుళ్లు 

మిరపను ఇటీవల ఆకుముడత (జెమిని వైరస్‌), మొజాయిక్, మొవ్వుకుళ్లు తెగులు అధికంగా ఆశించి నష్టం కలిగిస్తున్నాయి. వీటి నివారణ చర్యలు.. 

ఆకుముడత (జెమిని వైరస్‌) : ఈ తెగులాశించిన మొక్కలు చిన్నవిగా మారి పైకి ముడుచుకుని పడవ ఆకారంలో ఉంటాయి. ఆకుల ఈనెలు ఆకుపచ్చగా, ఈనెల మధ్య భాగం లేతాకుపచ్చ లేదా పసుపుపచ్చ రంగులో ఉంటుంది. కణుపుల మధ్య దూరం తగ్గుతుంది. ఆకుల మీద బొబ్బెలుగా ఏర్పడి ముడుచుకుంటాయి. ఈ తెగులును తెల్లదోమలు వ్యాí్త‡ చేస్తాయి. 

కుకుంబర్‌ మొజాయిక్‌ వైరస్‌ : దీంతో మొక్కలు గిడసబారుతాయి. ఎదుగుదల లోపిస్తుంది. ఆకులు పత్రహరితం కోల్పోతాయి. ఆకారం మారిపోయి, కొనలు సాగి మొజాయిక్‌ లక్షణాలు కనిపిస్తాయి. పూత, కాత ఉండదు. ఈ వైరస్‌ను పేనుబంక పురుగులు వ్యాప్తి చేస్తాయి. 

నివారణకు సమగ్ర చర్యలు 

వైరస్‌కు కలుపు మొక్కలు ఆశ్రయంగా మారుతాయి. అందువల్ల వీటిని తొలగించి గట్లను శుభ్రంగా ఉంచాలి. 

♦ పొలం చుట్టూ 2-3 వరుసలు ఎత్తు పెరిగే సజ్జ, జొన్న లేదా మొక్కజొన్నను రక్షణ పంటగా విత్తాలి. 

రసాయన, సేంద్రియ ఎరువులను సమతులంగా వాడాలి. 

వైరస్‌ తెగులును గమనించిన వెంటనే.. ఆయా మొక్కలను    పీకి కాల్చేయాలి. 

గ్రీజు పూసిన పసుపు రంగు అట్టలను పొలంలో అక్కడక్కడ ఉంచితే.. తెల్లదోమ వీటికి ఆకర్షితమై చనిపోతాయి. ఈ అట్టలను గమనించడం ద్వారా తెల్లదోమల ఉనికి, ఉధృతిని అంచనా వేయవచ్చు. 

తెల్లదోమ నివారణకు 5 శాతం వేపగింజల కషాయం లేదా లీటరు నీటికి ఎసిఫేట్‌ 1.5 గ్రా. లేదా ట్రైజోఫాస్‌ 1.25 మి.లీ. లేదా స్పైరోమెసిఫిన్‌ ఒక మి.లీ. కలిపి పైరుపై పిచికారీ చేయాలి. 

తామర పురుగుల నివారణకు.. లీటరు నీటికి ఫిప్రోనిల్‌ 2 మి.లీ. లేదా స్పైనోసాడ్‌ 0.25 మి.లీ. లేదా డైఫెన్‌థియురాన్‌ 1.25 గ్రా. కలిపి పిచికారీ చేసి మొవ్వుకుళ్లు వ్యాప్తిని అరికట్టాలి. 

పేనుబంక నివారణకు 10 లీటర్ల నీటికి 15 గ్రా. ఎసిఫేట్‌ లేదా థయోమిథాక్సాం 2 గ్రా. లేదా ఎసిటామిప్రిడ్‌ 2 గ్రా. కలిపి పిచికారీ చేయాలి. 

రసంపీల్చే పురుగులను అరికట్టడం ద్వారానే.. మిరపలో వైరస్‌ తెగుళ్ల నియంత్రణ సాధ్యమవుతుంది. 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.