close
తుంపర సాగుతో ప్రయోజనాలు

న్యూస్‌టుడే, బొండపల్లి 

మేలైన దిగుబడులు సాధించాలంటే.. సాగునీటి యాజమాన్యంపై అధిక శ్రద్ధ వహించాలి. సాగునీటి వాడకంలో సూక్ష్మసేద్య పద్ధతులకు ఆదరణ పెరుగుతోంది. వీటిలో తుంపర (స్ప్రింక్లర్‌) పరికరాల వాడకంతో వచ్చే ప్రత్యేక ప్రయోజనాలను బొండపల్లి వ్యవసాయాధికారి కె.రవీంద్ర తెలిపారు.  

కలిగే లాభాలు 

 ఈ పద్ధతిలో నీరందించేందుకు కాలువలు, గట్లు చేయనవసరం లేదు.  

సాధారణ పద్ధతిలో నీరు పారించినప్పుడు 35 శాతం పైగా నీరు కాలువ పక్కలకు ఇంకిపోతుంది. తుంపర పద్ధతిలో ఈ నష్టం ఉండదు. 

ఈ పద్ధతిలో పంట నాణ్యత పెరిగి, 5-20 శాతం వరకు అధిక దిగుబడి సాధించవచ్చు. 

తుంపర పద్ధతిలో నేలలో మొక్కల వేర్ల విస్తరణ ఆధారంగా అవసరమయినంత లోతుకు మాత్రమే తడివ్వొచ్చు. ముఖ్యంగా ఇసుక నేలల్లో సమర్థవంతంగా నీటి యాజమాన్యం చేపట్టవచ్చు. మొక్కలకు అవసరమైన నీటిని ఎక్కువ సార్లు తక్కువ మొత్తంలో ఇవ్వొచ్చు. 

తుంపరలా పడే నీటి వల్ల, నేలపై నీరు నిల్వ ఉండదు. మట్టి గడ్డకట్టదు. నేలలో తగినంత నిష్పత్తిలో గాలి, తేమ అందుబాటులో ఉండటం వల్ల విత్తనాలు త్వరగా మొలకెత్తుతాయి. మొక్కలు ఆరోగ్యంగా ఎదుగుతాయి. 

ఎగుడు దిగుడుగా ఉన్న నేలల్లో, నీటివసతి కన్నా ఎత్తులో ఉన్న భూముల్లోనూ ఈ పద్ధతిలో పంటల సాగు చేపట్టవచ్చు. 

ఈ పద్ధతిలో నీటిని పైపుల ద్వారా నిర్ణీత పీడనంతో (1.5 నుండి 3 కిలోలు/సెం.మీ.) ప్రవహింపచేసినప్పుడు నాచ్కీజిజిల్‌ నుంచి వర్షం మాదిరిగా వెలువడుతుంది. నీరు వర్షం మాదిరిగా పడటం వల్ల పరిసరాలు చల్లబడి అధిక ఉష్ణోగ్రతల నుంచి పంటలకు రక్షణ లభిస్తుంది. 

తుంపర పరికరాల ధర : ఎకరాకు సుమారు రూ.16,000 నుంచి రూ.18,500 ఖర్చవుతుంది. పైపులను బట్టి ధరలో కొద్ది మార్పులు ఉండవచ్చు. 

రాయితీ : ఈ పరికరాలను ప్రభుత్వం వ్యవసాయశాఖ ద్వారా రాయితీపై అందిస్తోంది. వీటిని పొందడానికి రైతులు తమ సమీప వ్యవసాయ కార్యాలయంలో సంప్రదించాలి. సుమారు మూడు ఎకరాల భూమి కలిగి, మోటార్‌ పంపు సదుపాయం ఉన్న బావి లేదా బోరుబావి ఉన్న రైతులకు మాత్రమే ప్రభుత్వం రాయితీపై డ్రిప్‌ లేదా స్ప్రింక్లర్‌ పథకాన్ని అందిస్తుంది.  

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.