close
మల్లెలో పోషక లోపాలు

మల్లె తోటల సాగులో సరైన యాజమాన్య, సస్యరక్షణ పద్ధతులను పాటించకపోవడం వల్ల పూల నాణ్యత, దిగుబడి తగ్గుతుంది. ఈ పంట సాగులో ప్రధానంగా స్థూల, సూక్ష్మ పోషక లోపాలను సవరిస్తే మంచి ఫలితాలు వస్తాయి.

నత్రజని : ఈ పోషకం లోపించినప్పుడు.. మొక్కల ఎదుగుదల ఆగిపోతుంది. ఆకులు పసుపు రంగులోకి మారతాయి. సవరణకు లీటరు నీటికి 10 గ్రా. చొప్పున యూరియా కలిపి పైపాటుగా పిచికారీ చేయాలి.
భాస్వరం : ఆకులు గులాబి రంగులోకి మారి, మొక్కలు గిడసబారుతాయి. సవరణకు లీటరు నీటికి 20 గ్రా. చొప్పున డి.ఎ.పి. కలిపి పిచికారీ చేయాలి.
గంధకం : లేతాకులు పసుపు రంగులోకి మారి, మొక్క గిడసబారుతుంది. సవరణకు లీటరు నీటికి 5 గ్రా. చొప్పున కాల్షియం సల్ఫేట్‌ కలిపి పిచికారీ చేయాలి.

క్యాల్షియం : ఆకుల్లో ఎదుగుదల ఉండదు. కొత్త ఆకులు ఎండి చిట్లిపోయి  కనిపిస్తాయి. సవరణకు లీటరు నీటికి 10 నుంచి 20 గ్రా. చొప్పున కాల్షియం క్లోరైడ్‌ కలిపి పిచికారీ చేయాలి.

బోరాన్‌ : కొత్తగావచ్చే ఆకులు ఎదగవు. దీంతో మొక్క గిడసబారుతుంది. ఆకులు పూర్తిగా ఏర్పడవు. సవరణకు లీటరు నీటికి 10 గ్రా. చొప్పున బోరాన్‌ను కలిపి మొక్కలపై పిచికారీ చేయాలి.

పొటాష్‌ : ఈ లోపంతో ముదురాకుల చివర్లు పాలిపోతాయి. సవరణకు 5 గ్రా. పొటాషియం క్లోరైడ్‌ లీటరు నీటికి చొప్పున కలిపి పైపాటుగా పిచికారీ చేయాలి.
మెగ్నీషియం : ముదురాకుల్లో ఈ లోపం కనిపిస్తుంది. ఆకుల ఈనెలు పాలిపోతాయి. నివారణకు 10 గ్రా. మెగ్నీషియం సల్ఫేట్‌ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
జింకు : ఆకులు చిన్నగా ఉండి, పసుపు రంగులోకి మారతాయి. సవరణకు లీటరు నీటికి 5 గ్రా. చొప్పున జింకు సల్ఫేట్‌ కలిపి పిచికారీ చేయాలి.
రాగి : ఆకులు ముదురాకుపచ్చగా మారి వంకర్లు తిరుగుతాయి. చెట్టు పొదలా మారుతుంది. ఆకులు చిరిగిపోతాయి. సవరణకు 2-5 గ్రా. కాపర్‌ సల్ఫేట్‌ పొడిని పాదులో వేయాలి లేదా 15 రోజుల వ్యవధిలో 2.5 గ్రా. కాపర్‌ సల్ఫేట్‌ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
ఇనుము : లేతాకుల ఈనెల మధ్య భాగం పసుపు రంగుకు మారి పాలిపోతాయి. ముదురాకులు పచ్చ రంగులోనే ఉంటాయి. సవరణకు లీటరు నీటికి 5 గ్రా. చొప్పున ఫెర్రస్‌ సల్ఫేట్‌ కలిపి పిచికారీ చేయాలి.

- భాగ్యరాజీ.నేతల

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.