close
సాగు గిట్టుబాటు కావాలి!

రైతులు కూడా ఒకటి, రెండు పంటలతో సరిపెట్టుకోకుండా వివిధ రకాల పంటలను తమ పొలంలో పండించాలి. ఒక పంటలో కాకపోయినా మరో పంటలో దిగుబడులు లేదా ధరలు కలిసి వస్తాయి. వీటితో పాటు పశుపోషణ, కోళ్ల పెంపకం వంటి ఉపవృత్తులు చేపట్టాలి. ఖర్చులు తగ్గించుకొనే మార్గాలు వెతకాలి. ప్రభుత్వం వ్యవసాయ రాబడులు పెరిగే యోచన చేసి రైతులను ఆదుకోకపోతే దేశ జనాభాలో సగానికి మించిన రైతాంగం జీవనం దుర్భరమవుతుంది.
వాతావరణ పరిస్థితులు అనుకూలించక, వ్యవసాయం సక్రమంగా సాగక రైతులు అప్పులపాలవుతున్నారు. సాగు ఖర్చులు పెరిగిపోయి, వ్యవసాయోత్పత్తులకు లాభసాటి ధర లభించక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఉన్న ప్రాంతాలను వదిలి, కొత్త ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. దేశంలో 58 శాతం ప్రజలకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో జీవనభృతి కల్పించేది వ్యవసాయమే. తెలుగు నేలపై అధిక శాతం రైతు కుటుంబాలు అప్పులతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఏటా రైతుల ఆదాయలు తగ్గిపోతున్నాయి. సాగునీటి కొరత, ఎరువులు, పురుగు మందుల ధరలు పెరుగుతుండటంతో.. ఖర్చులు పెరుగుతున్నాయి. దీనికి తగ్గట్టుగా ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లభించడం లేదు. ఈ సమస్యలు చాలవన్నట్టు దళారీ వ్యవస్థ దోపిడీతో రైతులు కుదేలైపోతున్నారు. సరైన విత్తనాలు దొరక్క, విత్తిన పైరు సరిగా పెరగక దిగుబడులు తగ్గిపోతున్నాయి. ఏదో ఒకసారి సంతృప్తికర దిగుబడులు వచ్చినా, ఎక్కువ సందర్భాల్లో రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. ఈ పరిస్థితుల నుంచి రైతులు గట్టెక్కాలంటే మద్దతు ధరలు పెంచాలి. దళారుల మోసాలను నియంత్రించాలి. ప్రభుత్వం కలుగజేసుకోనిదే మద్దతు ధరలు పెరగవు. దళారుల అక్రమాలకు కళ్లెం పడదు.

- డాక్టర్‌ మొవ్వ రామారావు

i

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.