close
వేరుసెనగలో చీడపీడల అదుపు

ప్రస్తుత వాతావరణం.. రబీ వేరుసెనగలో చీడపీడల వ్యాప్తికి అనుకూలంగా ఉన్నందున, రైతులు అప్రమత్తంగా ఉండి, అవసరమైతే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని పత్తికొండ వ్యవసాయ ఉపసంచాలకులు మహమ్మద్‌ఖాద్రీ తెలిపారు.

న్యూస్‌టుడే, మద్దికెర


టిక్కా ఆకుమచ్చ తెగులు :  తెగులు సోకిన ఆకులపై నల్లటి మచ్చలు ఏర్పడి ఆకులు రాలిపోతాయి. నివారణకు.. లీటరు నీటికి హెక్సాకొనజోల్‌ 1.5 మి.లీ. చొప్పున కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.


పచ్చ పురుగు : ఈ పురుగు ఆకులపై రంధ్రాలను చేస్తుంది. నివారణకు.. పది లీటర్ల నీటికి ఇమామెక్టిన్‌ బెంజోయేట్‌ 3 గ్రా. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.


లద్దె పురుగు : ఈ పురుగు రాత్రి వేళల్లో పంటపై దాడిచేసి ఆకులను తిని పంటను నష్టపరుస్తుంది. వీటి నివారణకు.. 10 కిలోల తవుడు, 2 కిలోల బెల్లం పాకం, పావు కిలో థయోడికార్బ్‌ కలిపి విషపు ఎరలను ఉండలుగా తయారు చేయాలి. ఈ ఉండలను మొక్కల మొదళ్ల వద్ద పడేలా చేలో వెదజల్లాలి.


సస్యరక్షణలో జీవరసాయనాలు

పర్యావరణానికి హాని చేయకుండా చీడపీడలను నియంత్రించేందుకు జీవరసాయనాలు సమర్థవంతంగా పనిచేస్తాయి.
* బ్యాక్టీరియా ఆధారితమైనవి : వీటిని బి.టి. మందులు అని పిలుస్తారు. రెక్కలజాతికి చెందిన శనగపచ్చ పురుగు, పొగాకు లద్దెపురుగు, నామాల పురుగు వంటి పురుగుల లార్వాల ఉధృతిని ఇవి తగ్గిస్తాయి. మార్కెట్‌లో డైపెల్‌, డెల్ఫిన్‌, బయోబిట్‌, బయోఆస్ప్‌, అగ్రిహాల్ట్‌ వంటి పేర్లతో దొరుకుతున్నాయి. వీటిని లీటరు నీటికి 1 గ్రా. లేదా 1 మి.లీ. చొప్పున కలిపి పైరుపై పిచికారి చేయాలి.
కీటకనాశక శిలీంద్రాలు: బవేరియా బాసియానా, మెటరైజియం అనైసొప్లి, వర్టిసిల్లియం లెకాని.. వంటి కీటకనాశక శిలీంద్రాలు మార్కెట్లో లభిస్తున్నాయి. ఇవి హానికారక పురుగులను ఆశించి, బూజులా ఏర్పడి పురుగులను నిర్వీర్యం చేస్తాయి. ఈ మందులను లీటరు నీటికి 5 గ్రా., చొప్పున కలిపి పైరుపై పిచికారి చేయాలి.


 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.