close
రబీ వేరుసెనగలో నీటి యాజమాన్యం!

న్యూస్‌టుడే, మద్దికెర

రబీలో వేరుసెనగను నీటివసతి ఉన్నచోటే సాగు చేస్తారు. నేల స్వభావాన్ని బట్టి నీటి తడులను అందించాలని పత్తికొండ వ్యవసాయశాఖ ఉపసంచాలకులు మహమ్మద్‌ఖాద్రీ తెలిపారు.  
నీటి పారుదల
* విత్తే ముందు నేల బాగా తడిచేలా నీరు పారించాలి. తగినంత పదును ఉన్నప్పుడు విత్తుకోవాలి.  

* విత్తిన 35 రోజుల వరకు నీరు పెట్టకుండా ఉంటే, పంట త్వరగా బెట్టకు వచ్చి, రెండో తడి అనంతరం పూతకు వస్తుంది.
* విత్తనం మొలకెత్తిన 30 నుంచి 35 రోజుల తర్వాతే రెండో తడివ్వాలి.  
* ఇలా కాకుండా మధ్యలో తడులిస్తే దిగుబడి తగ్గే అవకాశం ఉంది.
* నేల స్వభావాన్ని బట్టి 7-10 రోజుల వ్యవధిలో నీటి తడులివ్వాలి.
* చివరి తడి పంటకోతకు 7 రోజుల ముందు ఇవ్వాలి.


తేమకు సున్నిత దశలు

ఊడలు దిగే దశ నుంచి కాయలు ఊరే వరకూ పంట బెట్టకు గురికాకుండా చూడాలి. పంట 40 నుంచి 45 రోజులప్పుడు ఊడలు దిగి, 80 నుంచి 85 రోజుల్లో కాయలు ఊరతాయి. ఈ రెండు దశల్లో పైరు నీటి ఎద్దడికి గురికాకుండా చూడాలి. ఈ సమయంలో పంట బెట్టకు వస్తే దిగుబడి గణనీయంగా తగ్గే ప్రమాదం ఉంటుంది.  
నీటిని తుంపర్ల సేద్యం ద్వారా అందిస్తే.. 25-30 శాతం నీరు ఆదా అవుతుంది. అధిక దిగుబడి, నాణ్యమైన కాయలు వస్తాయి. నల్లరేగడి పొలాల్లో సాగు చేస్తున్నప్పుడు.. పొలంలో నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.