close
నువ్వు సాగులో మెలకువలు

న్యూస్‌టుడే, ఒంటిమిట్ట

నువ్వు సాగులో పాటించాల్సిన మెలకువలను ఊటుకూరు ఏరువాక, కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) శాస్త్రవేత్తలు డాక్టర్‌ ఎ.వీరయ్య, సి.ప్రత్యూష, డాక్టర్‌ బి.పద్మోదయ తెలిపారు.  
నీరు నిల్వని తేలిక నేలలు శ్రేష్ఠం. ఆమ్ల, క్షార నేలలు పనికిరావు. నేలను 2-4 సార్లు మెత్తగా దున్నాలి. రెండుసార్లు గుంటక తోలి చదును చేయాలి. వరి తర్వాత నువ్వులు విత్తే రైతులు పొలాన్ని మెత్తగా దుక్కి చేయాలి.  

విత్తే పద్ధతి : ఎకరాకు 2.5 కిలోల విత్తనం సరిపోతుంది. ఈ విత్తనానికి 7.5 కిలోల ఇసుక కలపాలి. గొర్రుతో వరుసల్లో విత్తితే కలుపు నివారణ సులువవుతుంది. విత్తనాన్ని వెదజల్లి సాగుచేస్తే కలుపు మందుల ప్రభావం వల్ల మొలక శాతం తగ్గుతుంది. పొలంలో  విత్తనం సమానంగా పడక.. మొలకలు ఒత్తుగా వస్తాయి. దీంతో పంట ఏపుగా పెరిగి, దిగుబడి తగ్గుతుంది. మొక్కలు పలుచగా ఉంటే మంచి దిగుబడి వస్తుంది.
విత్తనశుద్ధి: కిలో విత్తనానికి 3 గ్రా. మాంకోజెబ్‌తో విత్తనశుద్ధి చేయాలి. దీంతో నేల నుంచి వచ్చే తెగుళ్లను కొంతమేర నివారించవచ్చు.  
విత్తే దూరం, సమయం : వరుసల మధ్య 30 సెం.మీ, మొక్కల మధ్య 15 సెం.మీ. ఎడం ఉండాలి. నువ్వు సాగుకు జనవరి రెండు లేదా మూడో వారం అనుకూలం. ఆ తర్వాత విత్తే రైతులు.. నువ్వులో గొడ్డు తెగులును తట్టుకునే హిమ, చందన రకాలను ఎంపిక చేయాలి. ప్రస్తుతం ఆకుమచ్చ తెగుళ్లను తట్టుకునే యలమంచిలి-17, యలమంచిలి-66 రకాలను విత్తాలి.
రకాలు : గౌరి, మాధవి, యలమంచిలి-11, 17, 66 రకాలు అనుకూలం.  ఇవేకాక శ్వేతాతిల్‌, రాజేశ్వరి, హిమ, చందన (గోధుమ రంగు గింజలు), జెసీయన్‌-1020 రకాలు మేలైనవి. ఈ రకాలన్నీ గోధుమరంగు రకాల మాదిరిగానే దిగుబడినిస్తాయి.
ఎరువులు : ఆఖరి దుక్కిలో ఎకరాకు నాలుగు టన్నుల పశువుల ఎరువుతో పాటు 16 కిలోల యూరియా, 8 కిలోలు చొప్పున భాస్వరం, పొటాష్‌ ఎరువులను వేసి కలియదున్నాలి. పంట విత్తిన నెల రోజుల తరవాత కలుపు తీసి ఎకరాకు 16 కిలోల యూరియా, 8 కిలోల భాస్వరాన్ని సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌ రూపంలో వాడితే అదనంగా కాల్షియం, గంధకం లభించి దిగుబడి పెరుగుతుంది.
కలుపు నివారణ : విత్తిన 48 గంటల్లోపు లీటరు నీటికి.. పెండిమిథాలిన్‌ (30 శాతం) 4-5 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి. కలుపుమందు పిచికారీ చేయాలనుకుంటే గొర్రుతో విత్తడం మంచిది. మొక్క మొలిచిన 15 రోజులకు అదనంగా ఉండే ఒత్తు మొక్కలను తొలగించాలి. పైరు 20-25 రోజుల దశలో గొర్రుతో అంతరసేద్యం చేయాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.