close
త్రీకరణతోనే వ్యవసాయ ప్రగతి!

దేశంలో ఇప్పుడిప్పుడే రైతులు యాంత్రిక వ్యవసాయానికి అలవాటు పడుతున్నారు. అధిక భాగం ప్రపంచ దేశాల్లో యంత్ర సహాయంతోనే వ్యవసాయం జరుగుతోంది. వ్యవసాయక దేశమైన భారత్‌లో ఇంకా పాత పద్ధతులనే పాటిస్తున్నారు. వ్యవసాయానికి కూలీలు దొరకని ఈ సమయంలో యాంత్రిక వ్యవసాయానికి మళ్లటం ఆచరణీయం. వివిధ పంటలు, చిన్న కమతాలు గల దేశంలో పెద్ద యంత్రాలతో కాకపోయినా, రైతుల శ్రమను తగ్గించే చిన్న యంత్రాలు, పనిముట్లు వాడి వ్యవసాయాన్ని మరింత సౌకర్యంగా చేపట్టే ఆస్కారం ఉంది. ఈ చిన్న యంత్రాలు, పనిముట్లు రైతుల ఆర్థిక వనరులకు సరిపడేవిగా ఉండాలి. ఇలాంటి పంపిణీ వ్యవస్థలు లేనిదే యాంత్రిక వ్యవసాయం సామాన్య రైతులకు అందుబాటులోకి రాదు. తొలుత పెద్ద రైతులు యాంత్రిక వ్యవసాయం చేయగలిగినా, సన్న, చిన్నకారు రైతులకు చిన్నచిన్న యంత్రాలు లభించే ఏర్పాట్లు అందుబాటులోకి రావాలి.  
ఎగుమతులు.. పండ్లు, కూరగాయల ఎగుమతులకు బాటలు పరచాలి. ప్రపంచంలో గల వాతావరణ పరిస్థితులన్ని మన దేశంలో గల సౌకర్యాన్ని వినియోగించుకొని గిట్టుబాటు ధరలు లభించే అన్ని ఉద్యాన ఉత్పత్తులను ఎగుమతి చేసేలా అవకాశం మనకుంది. కొత్త పంటల్లో కొద్ది కాలంలోనే మన రైతులు నిష్ణాతులవుతారు. ముడిసరుకు కంటే ఎక్కువ కాలం నిల్వ ఉండే పండ్ల రసాలు, పేస్ట్‌లు లాంటివి చేసి ప్రాసెసింగ్‌ డబ్బాలలో నిల్వ చేసిన ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయగలగాలి. తగిన ధరలు రావడంతో వీటిపై రైతుల శ్రద్ధ పెరుగుతుంది. రాబడులు ద్విగుణీకృతం అవుతాయి. ప్రస్తుతం వ్యవసాయం జీవనాధారం గల ప్రజల జీవన పథంలో నైరాశ్యం ఎక్కువగా కనిపిస్తోంది. యాంత్రిక వ్యవసాయం, ప్రాసెసింగ్‌, పరిశ్రమలు, ఇతోధికంగా వస్తే గానీ రైతులకు మేలు జరగదు. ఎగుమతులు చేసినట్లే కొన్ని పంటల్లో ప్రసుత్తం దిగుమతులు అవసరం. మన దేశంలో చాలినంత ఖాడ్య తైలాలు లేవు. వీటిని ఆసియా దేశాలైన మలేషియా నుంచి పామాయిల్‌ దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. విదేశీ వ్యాపారాల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవసరం. అప్పుడే ప్రగతి సాధ్యమవుతుంది. రైతులకు మేలు జరుగుతుంది.

- డాక్టర్‌ మొవ్వ రామారావు

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.