close
సంచుల్లో.. సైలేజి!

ఏడాది పొడవునా పశువులకు పచ్చిమేతలను అందించేందుకు సాధారణంగా నేలలో గుంతతీసి సైలేజి (మాగుడు గడ్డి) పద్ధతిలో గ్రాసాన్ని నిల్వ చేస్తారు. ఈ పద్ధతికి వ్యయ ప్రయాసలు అవసరం. దీనికి బదులుగా గ్రాసాన్ని సంచుల్లోనూ సైలేజిగా నిల్వ చేయవచ్చు. రెండు పొరలుండే సంచుల్లో గ్రాసాన్ని నింపితే నాణ్యత బాగుండటంతో పాటు సైలేజి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.  
అనువైన పంటలు : మొక్కజొన్న, జొన్న వంటి ఏకవార్షిక పశుగ్రాసాలు, హైబ్రిడ్‌ నేపియర్‌ వంటి బహువార్షిక పశుగ్రాసాలు ఇందుకు అనువుగా ఉంటాయి.
తయారీ విధానం
* ఈ పశు గ్రాసాలను పూత దశలో కోయాలి. గ్రాసంలో తేమ 65-70 శాతానికి తగ్గే వరకు ఆరబెట్టాలి.
* తర్వాత గ్రాసాన్ని చిన్న చిన్న ముక్కలుగా (చాఫ్‌ కట్టర్‌తో) నరకాలి. (వర్షాలు లేని రోజుల్లో మాత్రమే ఈ పనిచేయాలి.)
* కత్తిరించిన గ్రాసాన్ని సంచుల్లో పొరలుగా పేర్చి, పొరల మధ్య గాలి ఉండకుండా బాగా తొక్కాలి. గ్రాసం మధ్య ఖాళీ ఉంటే బూజు పట్టే ప్రమాదం ఉంటుంది.
* పూర్తిగా నింపిన సంచి రెండు పొరలను విడివిడిగా కట్టి, వాటిపై బరువు ఉంచాలి. ఈ గడ్డి 2-3 సంవత్సరాల వరకు చెడిపోకుండా నిల్వ ఉంటుంది.
జాగ్రత్తలు : వర్షం, ఎండ తగలని చోట సంచులను నిల్వ చేయాలి. ఎలుకలు, ఉడతలు సంచులను కొరకకుండా భద్రపరచాలి.

 

ఉపయోగాలు
* గుంత పద్ధతిలో నిల్వ చేసిన సైలేజిలో నుంచి పోషకాలు కొద్ది శాతం భూమిలోకి ఇంకిపోతాయి. ప్లాస్టిక్‌ సంచుల్లో ఈ నష్టం ఉండదు.
* ఈ పద్ధతిలో తక్కువ స్థలంలోనే, రైతుకు అవసరం ఉన్నంతర మేరకే సైలేజి తయారు చేసుకోవచ్చు.
* ఈ విధానంలో కూలీ ఖర్చు, పెట్టుబడి తక్కువగా ఉంటాయి.
* అవసరానికి అనుగుణంగా గ్రాసాన్ని ఒక్కో సంచి నుంచి మాత్రమే తీయడం వల్ల, మిగిలిన గ్రాసం బూజుపట్టి పాడవదు (కొన్ని సందర్భాల్లో.. గుంత పద్ధతిలో మిగిలిన గ్రాసం బూజుపట్టి పాడవుతుంది). ఈ సంచులను సులభంగా ఇతర ప్రాంతాలకు రవాణా చేయవచ్చు.

- భాగ్యరాజీ. నేతల

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.