close
జీవాల్లో నట్టల నివారణ

ఈ నెల 2 నుంచి 8 వరకు ఉచితంగా మందుల పంపిణీ
న్యూస్‌టుడే, సంగారెడ్డి (టౌన్‌)

గొర్రెలు, మేకల్లో నట్టల నివారణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని సంగారెడ్డి జిల్లా పశుసంవర్థక శాఖ జేడీ రామారావు రాథోడ్‌ తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.  
నట్టలతో సమస్యలు
గొర్రెలు, మేకల్లో ఏలికపాములు, బద్దెపురుగులు, జలగలు మొదలైన అంతరపరాన్న జీవులు అనేక రుగ్మతలను కలిగిస్తాయి.
ఇవి శరీరం, కాలేయం, ఊపిరితిత్తులు, పేగులు, జీర్ణాశయాల్లో స్థావరం ఏర్పరచుకోవడం వల్ల జీవాలు రక్తహీనతకు గురవుతాయి.  
దీంతో జీవాల ఆకలి మందగించడం, మేత మేయకపోవడం, పొట్ట లావుగా మారడం వంటి సమస్యలు తలెత్తుతాయి. జిగటతో కూడిన ఎర్రని, ఆకుపచ్చ రంగులో విరేచనాలు అవుతాయి.  
పేగుల్లో కురుపులు, వాసనతో కూడిన విరేచనాలు, కాలేయం పగిలి రక్తస్రావాలు అవ్వడం, దాహం ఎక్కువవ్వడం, నీరసపడటం, ముక్కుల నుంచి రక్తం కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.  

కలిగే ప్రయోజనాలు
జీవాలు ఆరోగ్యంగా, బలంగా, చురుగ్గా ఉంటాయి.
వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.  
పాలు, మాంసం, ఉన్ని దిగుబడి పెరుగుతుంది.
పొట్టేళ్లు సగటున 2 కిలోల అధిక బరువు పెరిగి, 10 శాతం అధిక రాబడి వస్తుంది.
జీవాలు త్వరగా ఎదకొచ్చేందుకు వీలుంటుంది.
గొర్రె పిల్లలు, పెద్ద జీవాల మరణాలు తగ్గుతాయి.  
అంతర పరాన్న జీవుల నిర్మూలనకు నట్టల మందును ఏడాదికి మూడుసార్లు తాగించాలి.
పశువైద్యాధికారులు బృందాలుగా ఏర్పడి ప్రతి గ్రామంలో జీవాలకు నట్టల నివారణ మందులను పంపిణీ చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. మరింత సమాచారం కోసం పెంపకందార్లు తమ సమీప పశుసంవర్థకశాఖ కార్యాలయాన్ని గానీ పశువైద్యులను గానీ సంప్రదించవచ్చు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.