close
తైవాన్‌ జామకు తేయాకు దోమ బెడద!

తైవాన్‌ జామ తోటలను ఇటీవల తేయాకు దోమలు ఆశించి నష్టం కలిగిస్తున్నాయి. వీటి నివారణకు రైతులు సకాలంలో చర్యలు చేపడితే ఆశించిన దిగుబడులు వస్తాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ఉద్యాన శాస్త్రవేత్త బి.శివ, సమన్వయకర్త డాక్టర్‌ జి.వీరన్న తెలిపారు.

- న్యూస్‌టుడే, ఖమ్మం (వ్యవసాయం)

ప్రాథమిక దశలోనే గుర్తించాలి
ఈ పురుగు.. తైవాన్‌ జామ, జీడి మామిడి తోటల్లో పూమొగ్గలు, పూలను, పూరెమ్మలను ఆశించి పూత నిలవకుండా, పిందె కట్టకుండా చేస్తుంది. కొన్ని సందర్భాల్లో పుష్పగుచ్ఛాలు మొత్తం ఎండి మగ్గి పోయేటట్లు చేస్తుంది. దోమ ఆశిస్తే.. లేత రెమ్మలు ఎండిపోతాయి. పురుగు సోకిన జామ కాయలకు మార్కెట్లో ధర రాదు. ఈ కాయలతో తయారు చేసే జామ్‌, స్క్వాష్‌లు నిల్వ ఉండవు. ప్రాథమిక దశలోనే పురుగు ఉనికిని గుర్తించి నియంత్రించాలి. లేదంటే పిల్ల, తల్లి పురుగులు ఆకులను, లేత చిగుళ్లను, పండ్లను ఆశించి రసాన్ని పీలుస్తాయి. దీంతో చిగుళ్లు గోధుమ రంగులోకి మారతాయి. క్రమంగా ఆకులు, రెమ్మలపై నల్లటి చారలు (నెక్రోటిక్‌ ప్యాచెస్‌) ఏర్పడతాయి. కాయలపై నల్లటి బొబ్బలు వచ్చి, కండ లోపల అక్కడక్కడ గడ్డలు ఏర్పడతాయి. కాయలు ఆకారం కోల్పోయి, చెట్ల నుంచి రాలుతాయి.

యాజమాన్యం
దోమ కాటుకు గురైన పిందెలు, కాయలను, రాలిన పండ్లను సేకరించి కాల్చేయాలి. తోటలో పరిశుభ్రత చర్యలను పాటించాలి.
ఏటా చెట్లలో ఉండే గుబురు కొమ్మల్ని, అడ్డుకొమ్మల్ని, ఎండు కొమ్మల్ని పూర్తిగా కత్తిరించాలి. కాయలు కాసిన కొమ్మలను నాలుగింట మూడొంతులు కత్తిరించాలి. ఇలా చేస్తే కాపు కాసిన కొమ్మలకు పక్క కొమ్మలు వచ్చి నాణ్యమైన దిగుబడి వస్తుంది.  
చెట్ల కత్తిరింపులైన తర్వాత లీటరు నీటికి.. 3 గ్రాముల బ్లైటాక్స్‌ కలిపి పిచికారీ చేయాలి.  
కొత్త రెమ్మలు తొడిగే సమయంలో లీటరు నీటికి.. వేపకషాయం 50 మి.లీ. లేదా వేపనూనె 5 మి.లీ. చొప్పున కలిపి పక్షం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
కొత్త ఆకు తొడిగే సమయంలో ప్రధాన ఎరువులతో పాటు సూక్ష్మపోషక మిశ్రమాన్ని లీటరు నీటికి 5 గ్రా. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.  
పిందె సమయంలో పురుగు ఉంటే లీటరు నీటికి.. క్లోరిపైరిఫాస్‌ 2.5 మి.లీ. కలిపి పిందెలు తడిచేలా పిచికారీ చేయాలి. 

ఎకరానికి 30-40 పసుపు రంగు జిగురు అట్టలను లేదా దీపపు ఎరలను అమర్చి, వీటి ఉద్ధృతిని కొంత తగ్గించవచ్చు.

కాపు తగ్గిన ముదురు తోటల్లో చీడపీడలు అధికంగా ఆశించే చెట్లలో పునరుద్దరణ చర్యలు చేపట్టాలి. ఈ చెట్లలో 3-4 అడుగుల ఎత్తులో కొమ్మల్ని కత్తిరించాలి. అనంతరం కత్తిరించిన  భాగాలపై బోర్డోపేస్ట్‌ లేదా ఆవుపేడ పూయాలి.

తోటలో సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. వర్షాకాలంలో ఖాళీ స్థలంలో జీలుగ లేదా జనుము పైర్లను పచ్చిరొట్టగా పెంచి పూత దశలో నేలలో కలియదున్నాలి. దీంతో భూసారం పెరిగి 7-8 ఏళ్ల పాటు నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చు. చీడపీడల బెడద కూడా తగ్గుతుంది.  
అధిక సాంద్రత (తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు) గల తోటల్లో కాయ చెట్టుపై ఉండగానే నెట్టెడ్‌ క్లాత్‌తో బ్యాగింగ్‌ చేయాలి. ఇవి మార్కెట్లో 10 శ్రీ 10 సెం.మీ. పరిమాణంలో దొరుకుతాయి. ఒక్కో బ్యాగు ధర రూ.4 వరకు ఉంటుంది. వీటిని వాడి తేయాకు దోమ, పండు ఈగల బెడదను అరికట్టవచ్చు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.