close
వరి నారు పెంపకం

న్యూస్‌టుడే, బొమ్మనహాళ్‌

బీలో వరి సాగుకు విత్తన ఎంపిక, విత్తనశుద్ధి, నారుమళ్ల తయారీ, నాట్లు, ఎరువుల వాడకం, సస్యరక్షణ.. వంటి యాజమాన్య పద్ధతుల్లో మెలకువలు పాటిస్తే మంచి దిగుబడులు వస్తాయని బొమ్మనహాళ్‌ వ్యవసాయ శాఖాధికారి దేవీ పద్మలత తెలిపారు.
రకాలు
రబీలో తక్కువ పంటకాలమున్న వంగడాలనుఎంపిక చేసుకోవాలి. దీని వల్ల ఎండలు పెరిగే నాటికి పంట కోతకు వచ్చి, నీటి ఎద్దడి బారినుంచి తప్పించుకోవచ్చు. నాలుగు నెలల పంటకాలం ఉండే రకాలను సాగు చేస్తే మంచిది. ఎన్‌ఎల్‌ఆర్‌, ఐఆర్‌ఆర్‌-93, తెల్లహంస, ఆర్‌ఎన్‌ఆర్‌ రకాలు అనుకూలమైనవి.  
విత్తన మోతాదు  
ఎకరానికి 20-25 కిలోల విత్తనం సరిపోతుంది.
శ్రీవరి సాగుకైతే ఎకరానికి రెండు కిలోల విత్తనం అవసరమవుతుంది.
డ్రమ్‌సీడర్‌తో విత్తేందుకు ఎకరాకు 15-18 కిలోల విత్తనం సరిపోతుంది.  
మెట్ట నారుమళ్ళకు.. కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బండిజమ్‌ను తడితో పట్టించి, విత్తనాన్ని శుద్ధి చేయాలి.
దమ్ము చేసిన నారు మడితే కిలో విత్తనాన్ని, లీటరు నీటికి ఒక గ్రాము కార్బండిజమ్‌ కలిపిన ద్రావణంలో 24 గంటలు నానబెట్టి, మండెకట్టి మొలక వచ్చాక చల్లుకోవాలి.

నారుమడి తయారీ
దు సెంట్ల విస్తీర్ణంలో పెంచిన నారు ఎకరానికి సరిపోతుంది.
ముందుగా నేలను దుక్కి చేసి, చదును చేయాలి.  
ఐదు సెంట్ల దుక్కిలో కిలో చొప్పున నత్రజని, భాస్వరం, పొటాష్‌ పోషకాలను అందించే ఎరువులను వేయాలి.
సెంటుకు ఐదు కిలోల మొలక కట్టిన విత్తనం చల్లాలి.  
నారుమడిలో విత్తిన 10-15 రోజులకు కిలో నత్రజనిని అందించే ఎరువులను వేయాలి.
నారు తీసే 5-6 రోజుల ముందు మడిలో 800 గ్రాముల కార్బోప్యూరాన్‌ గుళికలను చల్లాలి.

నాట్లలో మెలకువలు
నారు పోసిన 30 నుంచి 35 రోజుల తరువాత నారు లేతగా ఉన్నప్పుడే నాట్లు వేసుకోవాలి.
దీనివల్ల పిలకలు ఎక్కువగా వచ్చి దిగుబడి పెరుగుతుంది.
నారు ముదిరితే.. చివర్లను 4-5 అంగుళాలు కత్తిరించి నాటాలి.
ప్రతి చదరపు మీటరుకు 44 మొక్కలు (మూనలు) ఉండేలా చూసుకోవాలి.
నాట్లు వేసిన అనంతరం ప్రధాన పొలంలో ప్రతి రెండు మీటర్లకు ఒక అడుగు మేర కాలిబాటలు తీయాలి. ఇలా చేయడం ద్వారా వరిలో దోమ పోటు సమస్యను నివారించవచ్చు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు