close
పైర్లలో ప్రస్తుత చర్యలు

న్యూస్‌టుడే, దొర్నిపాడు

వివిధ దశల్లో ఉన్న పైర్లలో చీడపీడల నివారణకు ప్రస్తుతం చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలను దొర్నిపాడు వ్యవసాయాధికారి కల్యాణకుమార్‌ తెలిపారు.  
శనగ : పైరు తొలి దశలో.. రబ్బరు పురుగు మొగ్గ దగ్గర పత్రహరితాన్ని గోకి తిని నష్టపరుస్తుంది. నివారణకు లీటరు నీటికి.. క్లోరిపైరిఫాస్‌ 2.5 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
జొన్న : కాండం తొలుచు పురుగు పంట 30 రోజుల దశ నుంచి కోత వరకు ఆశిస్తుంది. నివారణకు విత్తిన 35 నుంచి 40 రోజుల దశలో ఎకరానికి 4 కిలోల కార్బోప్యూరాన్‌ 3జి గుళికలను కాండం సుడుల్లో వేయాలి.
కంది : రబీలో విత్తిన పైరుపై కాయతొలిచే ఆకుపచ్చ పురుగును గమనిస్తే నివారణకు లీటరు నీటికి.. ఎసిఫేట్‌ 1.5 గ్రా. లేదా మోనోక్రోటోఫాస్‌ 1.6 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి. పంట విత్తిన 30-60 రోజుల్లో గొర్రు లేదా గుంటకతో అంతర సేద్యం చేసి కలుపును నివారించవచ్చు.
మొక్కజొన్న : తుప్పు తెగులు వల్ల ఆకులపై రెండు వైపులా పొడవాటి గోధుమరంగు మచ్చలు ఏర్పడి పైరుకు నష్టం కలిగిస్తాయి. నివారణకు లీటరు నీటికి.. మాంకోజెబ్‌ 2.5 గ్రా. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.  
మిరప : పైముడత, కిందిముడత ఆశించే ప్రమాదం ఉంటుంది. పైముడత నివారణకు.. లీటరు నీటికి 2 మి.లీ. ఫిప్రోనిల్‌, కింద ముడత నివారణకు డైకోఫోల్‌ 5 మి.లీ. చొప్పున కలిపి ఆకులు తడిచేలా పిచికారీ చేయాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.