close
వరిలో కలుపు నివారణ

న్యూస్‌టుడే, విజయనగరం (వ్యవసాయం)

పంటలో అధికోత్పత్తికి సమగ్ర పోషక యాజమాన్యం ఎంత ముఖ్యమో కలుపు నివారణా అంతే ముఖ్యం. పంటకు వేసే పోషకాలను కలుపు మొక్కలు గ్రహించడం వల్ల సుమారు 40 శాతం దిగుబడి తగ్గే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ప్రతి పంటలోనే కలుపు నివారణకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ప్రధానంగా వరిలో కలుపు నివారణకు చేపట్టాల్సిన చర్యలను ఏరువాక కేంద్రం సమన్వయకర్త కెల్ల లక్ష్మణ్‌ తెలిపారు.  
నివారణ చర్యలు
ముందస్తు చర్యల్లో భాగంగా.. వేసవిలో లోతు దుక్కులు దున్నడం వల్ల 50 శాతం కలుపును నియంత్రించవచ్చు.
పంట వరుసల మధ్య కోనోవీడర్‌ గానీ, రోటోవీడర్‌ను గానీ నడిపి కలుపును నివారించుకోవచ్చు.
తేలికపాటి నేలల్లో కలుపు మందులను తక్కువ మోతాదులో, మధ్యస్థ ఎర్రనేలలతోపాటు సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉండే నల్లరేగడి నేలల్లో ఎక్కువ మోతాదులో ఉపయోగించాలి.  
కలుపు నివారణకు రసాయన మందులతోపాటు అవసరాన్ని బట్టి అంతరకృషి పద్ధతులను అవలంబిస్తే పంట దిగుబడులు సాధించవచ్చు.  
పంటకు సిఫారసు చేసిన కలుపు మందులను సరైన మోతాదులో, నేలలో పదును ఉన్నప్పుడు చల్లుకోవాలి.  
మెట్ట, ఆరుతడి పైర్లలో కలుపు నివారణకు మందులను పిచికారీ చేస్తే ప్రయోజనం ఉంటుంది. వరి పంటకు ఇసుకలో కలిపి చల్లుకోవాలి.
కలుపు మందులను హ్యాండ్‌ స్ప్రేయర్‌తో ఉదయం లేదా సాయంత్రం పూట పిచికారి చేయాలి. గాలి వేగం గంటకు 20 కి.మీ. కన్నా తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే పిచికారీ చేయాలి.  
సూచించిన కలుపు మందును ఎకరానికి 200 లీటర్ల నీటిలో పిచికారీ చేయాలి.

నేరుగా విత్తిన వరిలో
ఈ పద్ధతిలో విత్తిన వరిలో కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. నివారణకు విత్తిన 3-5 రోజుల్లోపు ఎకరానికి 200 లీటర్ల నీటిలో ప్రిటిలాక్లోర్‌ లేదా సేఫ్‌నర్‌ (సోఫిట్‌) 600 మి.లీ. నుంచి 800 మి.లీ. కలిపి పిచికారీ చేయాలి లేదా 5-7 రోజుల్లో పైరజో సల్ఫ్యూరాన్‌ ఇథైల్‌ (సాథి) ఎకరానికి 200 లీటర్ల నీటిలో 80 నుంచి 100 గ్రా. కలిపి పిచికారీ చేయాలి.    

నాటిన వరి పంటలో...

వరి నాటిన 5-6 రోజులోపు ఎకరానికి 200 లీటర్ల నీటిలో ఫైరజో సల్ఫ్యూరాన్‌ ఇథైల్‌ (సాథి) 80-100 గ్రా లేదా ప్రిటిలాక్లోర్‌ 6 శాతం (లోండాస్‌ పవర్‌-టి) గుళికలు 4 కిలోలు చల్లాలి.
గడ్డిజాతి కలుపు నివారణకు నాటిన 15-20 రోజుల్లోపు 200 లీటర్ల నీటిలో సైహలోపాప్‌ పి బ్యూటైల్‌ లేదా ఫినాక్సి ప్రాప్‌ పి ఇథైల్‌ 200-250 మి.లీ. కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి.
గడ్డి, వెడల్పాకు జాతి కలుపు నివారణకు బిస్‌పైరిబాక్‌ సోడియం ఎకరానికి 100 మి.లీ., (అనగా లీటరు నీటికి అర మిల్లీలీటరు చొప్పున మందు కలిపి) నాటిన 15 నుంచి 20 రోజుల్లోపు పిచికారి చేయాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.