close
పత్తి తీతలో జాగ్రత్తలు

త్తి తీతలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మార్కెట్లో ఆశించిన ధర రాదు. సాధారణంగా పత్తి తీతలు డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలల్లో జరుగుతుంటాయి. ఈ మాసాల్లోనే మంచు ఎక్కువగా కురుస్తుంది. మంచులో తడిసిన పత్తిని సరైన పద్ధతిలో జాగ్రత్త చేయకపోతే, పత్తి నల్లబడి నాణ్యత కోల్పోతుంది. ఈ నేపథ్యంలో పత్తి తీతల్లో తీసుకోవలసిన మెలకువలను పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండల వ్యవసాయాధికారి పోశారావు వివరించారు.  
పత్తి నాణ్యత ముఖ్యంగా పింజ పొడవు, గట్టితనం, మృదుత్వం, పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది.
పత్తి నాణ్యత అనేది జన్యుపరమైన విషయమైనప్పటికీ, సాగులో ఆచరించే మేలైన యాజమాన్య పద్ధతులు, వాతావరణం, చీడపీడల ప్రభావం కొంతమేర ప్రభావం చూపుతాయి.
పూత దఫదఫాలుగా రావటం వల్ల పత్తిని నాలుగైదు సార్లు తీయాల్సి ఉంటుంది. తీత సమయంలో ఎండిన ఆకులు, ఇతర చెత్త కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
తీసిన పత్తిని నీడలో ఆరబెట్టి నిల్వచేయాలి.
నిల్వ చేసే ప్రదేశం గాలి తగిలేలా ఉండాలి. తేమ పడకూడదు.
బాగా ఎండిన పత్తిని మాత్రమే కాయల నుంచి వేరుచేయాలి.
పత్తి తీత కాలంలో మంచు కురుస్తుండటం వలన పత్తి మంచులో తడిసిపోతుంటుంది. అందుకే తీత వేళలను అందుకు అనుగుణంగా నిర్ణయించుకోవాలి. ఉదయం 8 గంటల తర్వాత మధ్యాహ్నం ఒంటిగంట లోపు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల్లోపు తీతకు సమయం అనువుగా ఉంటుంది.
ఎండవేడిమి ఎక్కువగా ఉన్న సమయంలో పత్తితీస్తే, వేడికి ఎండిన కాయలు, ఆకులు పత్తితో పాటు వస్తుంటాయి. అందుకే ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో పత్తి తీత మంచిది కాదు.  
పత్తి తీయగానే నీడలో ప్లాస్టిక్‌ పట్టాల మీద వేసి ఆరబెడితే గింజ గట్టిపడి పత్తిలో తేమ శాతం తగ్గి, శుభ్రంగా ఉంటుంది. ఈ పత్తిని గోనె సంచుల్లో తొక్కి తేమ తగలకుండా నిల్వ చేసుకోవాలి.
పత్తి తీసిన వెంటనే ఆరబెట్టకుండా సంచుల్లో తొక్కి నిల్వ చేస్తే, తేమకు గింజ ముడుచుకుపోవడం, దూది నాణ్యత తగ్గడం వంటి అనర్థాలుంటాయి.
రైతులు పలు జాగ్రత్తలు తీసుకోవటం వలన పత్తిపింజ నాణ్యతగా ఉండి, మార్కెట్లో మంచిధరను పొందే వీలుంటుంది.

- న్యూస్‌టుడే, కుక్కునూరు

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.