close
ధనియాల పంటలో సస్యరక్షణ

న్యూస్‌టుడే, బనగానపల్లి

ప్రస్తుతం ధనియాల పంటను వివిధ చీడపీడలు ఆశించి నష్టపరుస్తున్నాయి. ఈ దశలో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలను బనగానపల్లి కృషివిజ్ఞాన కేంద్రం (కేవీకే) సీనియర్‌ శాస్త్రవేత్త ధనలక్ష్మి (సెల్‌:9440607424) తెలిపారు.

పురుగులు
ఎర్రనల్లి : ఇవి ఆకుల అడుగున గుంపులుగా చేరి రసాన్ని పీల్చి నష్టం కలిగిస్తాయి. నివారణకు లీటరు నీటికి.. నీటిలో కరిగే గంధకం 3 గ్రా. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
తామర పురుగులు : ఆకులను, పూతను గీకి రసాన్ని పీల్చి నష్టపరుస్తాయి. నివారణకు.. లీటరు నీటికి ఫిప్రోనిల్‌ 2 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
పొగాకు లద్దెపురుగు : వీటి పిల్ల పురుగులు ఆకులు, పూత, గింజలను తింటాయి. దీంతో పంట దిగుబడి తగ్గుతుంది. నివారణకు.. లీటరు నీటికి ఎసిఫేట్‌ 1 గ్రాము చొప్పున కలిపి పిచికారీ చేయాలి.

తెగుళ్లు
బూడిద తెగులు : ఆకులు, కాండంపై బూడిద రంగు మచ్చలేర్పతాయి. నివారణకు లీటరు నీటికి 1 గ్రాము కార్బండజిమ్‌ చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
గింజ నలుపు తిరుగుట : చేలో ఈ సమస్యను గుర్తించినప్పుడు లీటరు నీటికి మాంకోజెబ్‌ 3 గ్రా. చొప్పున కలిపి పూత నుంచి గింజ పట్టే దశల్లో రెండుసార్లు పిచికారీ చేయాలి.
పేనుబంక : ఈ పురుగులు ఆకులు, పూత నుంచి రసాన్ని పీల్చి గింజలు ఏర్పడకుండా చేస్తాయి. నివారణకు.. లీటరు నీటికి 1.6 మి.లీ. మోనోక్రోటోఫాస్‌ లేదా మిథైల్‌ డెమిటాన్‌ 2 మి.లీ. చొప్పున కలిపి పైరుపై పిచికారీ చేయాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.