close
కూరగాయల్లో చీడల నివారణ

న్యూస్‌టుడే, హాలహర్వి

కూరగాయల సాగులో మేలైన దిగుబడులు సాధించేందుకు పాటించాల్సిన సస్యరక్షణ చర్యలను ఆలూర్‌ క్లస్టర్‌ ఉద్యానశాఖ అధికారిణి శ్రీవాణి సూచించారు. 


బెండ

మొవ్వు, కాయతొలుచు పురుగు : దీని నివారణకు పురుగాశించిన కొమ్మలను అవి నష్టపరిచిన చోటు నుంచి అంగుళం కిందకు తుంచేయాలి. లీటరు నీటికి 3 గ్రా. కార్బిరిల్‌ లేదా 2 మి.లీ. క్వినాల్‌ఫాస్‌ కలిపి పది రోజుల వ్యవధిలో రెండుసార్లు కాయలు కోసిన తర్వాత పిచికారీ చేయాలి.


ఎర్రనల్లి : పంట చివరి దశలో సన్నని ఎర్ర పురుగులు ఆకుల అడుగున చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు తెల్లగా పాలిపోయి క్రమంగా పండుబారతాయి. నివారణకు లీటరు నీటికి.. 3 గ్రా. చొప్పున నీటిలో కరిగే గంధకం లేదా 5 మి.లీ. చొప్పున డైకోఫాల్‌ కలిపి పిచికారీ చేయాలి.

రసంపీల్చే పురుగులు
బెండ, వంగ, టమాట పైర్లను ఆశించే దీపపు పురుగులు, పేనుబంక, తెల్లదోమలు.. ఆకుల నుంచి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పసుపు రంగులోకి మారి పైకి ముడుచుకొని ఎండిపోతాయి. నివారణకు లీటరు నీటికి 2 మి.లీ. చొప్పున డైమిథోయేట్‌ లేదా మిథైల్‌ డెమెటాన్‌ లేదా ఫిప్రొనిల్‌ కలిపి పిచికారీ చేయాలి. పసుపురంగు డబ్బాలకు గ్రీజు పూసి చేలో ఉంచి తెల్లదోమలను అరికట్టాలి.


వంగ

కాయతొలుచు పురుగు : పంట నాటిన 45 రోజుల దశలో ఇది ఆశిస్తుంది. మొక్కల పెరుగుదల దశలో మొవ్వును, తర్వాత దశలో కాయలను తొలుస్తుంది. నివారణకు పురుగాశించిన కొమ్మలను తొలగించాలి. లీటరు నీటికి కార్బరిల్‌ (50 శాతం డబ్యూ.పి) 3 గ్రా. లేదా ప్రొఫెనోఫాస్‌ 2 మి.లీ. చొప్పున కలిపి పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. 


టమాట

కాయ తొలుచు పురుగు : ఇది లేత ఆకులు, కొమ్మలు, కాయలను తొలుస్తుంది. నివారణకు ఎర పంటగా అక్కడక్కడ బంతి మొక్కలను నాటాలి. ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు పెట్టాలి. పది లీటర్ల నీటికి 3 మి.లీ. చొప్పున ప్లూబెండమైడ్‌ కలిపి పిచికారీ చేయాలి. కాయకోత తర్వాతే మందులను పిచికారీ చేయాలి.
రబ్బరు పురుగు : నివారణకు విషపు ఎరలను చల్లాలి. వీటి తయారీకి.. 10 కిలోలు తవుడు + కిలో కార్బరిల్‌ (50 శాతం పొడి) మందు + కిలో బెల్లం + తగినంత నీరు కలిపి ఉండలుగా చేసి సాయంత్రం పూట మొక్కల మొదళ్ల వద్ద వేయాలి.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.