close
మల్లెలో ప్రస్తుత చర్యలు

న్యూస్‌టుడే, జగిత్యాల (వ్యవసాయం)

పూలల్లో మల్లె ప్రత్యేకమైనది. ఈ పంట సాగులో రైతులు మేలైన పద్ధతులను పాటిస్తే నాణ్యమైన అధిక దిగుబడులు సాధించవచ్చని జగిత్యాల జిల్లా ఉద్యానశాఖ అధికారి జె.ప్రతాప్‌సింగ్‌ (సెల్‌:79977 25061) సూచించారు.
* చలి తక్కువుండే ప్రాంతాలు మల్లె సాగుకు అనుకూలం. జాస్మినం గ్రాండిఫ్లోరం, జాస్మినం ఆరికులేటం, జాస్మినం సంబాక్‌ రకాలను రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు.
* కొమ్మ కత్తిరింపులు, లేయర్లు, పిలకలు నాటడం వంటి పద్ధతుల్లో మొక్కల పెంపకం చేపట్టవచ్చు.
* పూల దిగుబడికి, కత్తిరింపులకు జనవరి రెండోపక్షం అనుకూలం.
* జాస్మినం సంబాక్‌ డబుల్‌ రకాన్ని నాటినప్పుడు.. ఫిబ్రవరిలో అడుగు ఎత్తులో కత్తిరింపులు చేస్తే పూల దిగుబడి పెరుగుతుంది.
* పూతకు ముందు కత్తిరింపులు చేయడం ద్వారా రెమ్మల చివరి భాగం, పక్క కొమ్మల నుంచి మంచి దిగుబడి వస్తుంది.
* కత్తిరింపుల వల్ల మొక్క ఎదుగుదలతో పాటు కొత్తగా పూమొగ్గలు ఏర్పడతాయి.
* పూల దిగుబడిని పొడిగించాలనుకుంటే చివర్లను పించింగ్‌ (గిల్లడం) చేయాలి.
* మొక్కలు నాటిన మూడో ఏడాది నుంచి 12-15 ఏళ్ల వరకు దిగుబడి వస్తుంది.
* సిఫారస్సు చేసిన మేరకే ఎరువులు వాడాలి. ఎరువులు ఎక్కువగా వేస్తే కొమ్మల పెరుగుదల ఎక్కువై, పూల దిగుబడితో పాటు నాణ్యత దెబ్బతింటుంది.

ఎరువులు
* కత్తిరింపుల తరువాత నేలను దున్ని వారం రోజులు ఎండిన తర్వాత ప్రతి చెట్టు చుట్టూ గాడిచేసి అందులో 2.5 కిలోల మాగిన పశువుల ఎరువు, 100 గ్రా. వేపపిండి, 200 గ్రా. చొప్పున అమోనియం సల్ఫేటు, 100 గ్రా. సూపర్‌ఫాస్ఫేట్‌, 75 గ్రా. మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ ఎరువులు వేసి మట్టి కప్పి నీటి తడులివ్వాలి.
* పూతకు ముందు సూక్ష్మపోషక ధాతువుల మిశ్రమం లీటరు నీటిక.. 5 గ్రా. చొప్పున కలిపి పిచికారీ చేస్తే పూల దిగుబడి పెరుగుతుంది. వారానికోసారి నీడితడివ్వాలి. మొక్క ఎదుగుదలకు, పూత పూయడానికి నేలలో తగినంత తేమ ఉండాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు