
న్యూస్టుడే, ఆదిలాబాద్ (వ్యవసాయం)
వర్షభావం ఉన్న ప్రాంతాల్లో కొర్రను ఆరుతడి పద్ధతిలో ఏక పంటగా, ఇతర పంటలతో కలిపి అంతర పంటగా విత్తవచ్చని ఆదిలాబాద్ ఏరువాక శాస్త్రవేత్త సుధాన్ష్ (సెల్: 91778 19970) సూచించారు.
*పంటకాలం 75-80 రోజులు. సూర్యనంది, ఎ.ఐ.ఎ-3085 రకాలు ఖరీఫ్, వేసవి సాగుకు అనుకూలం. ఈ రకాలు అగ్గితెగులును తట్టుకుంటాయి.
* ఎకరానికి 10-12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. వేసవి పంటగా జనవరి రెండో పక్షం వరకు విత్తాలి.
* ఎకరానికి రెండు కిలోల విత్తనం సరిపోతుంది. కిలో విత్తనానికి 3 గ్రా. థైరమ్ లేదా కాప్టాన్ కలిపి విత్తనశుద్ధి చేయాలి.
* తేలికపాటి ఎర్ర చల్కా, నల్లరేగడి, మురుగునీరు పోయే నేలలు సాగుకు అనుకూలం.
* అంతర పంటలుగా కొర్రలో కంది లేదా సోయాచిక్కుడులను 5:1 నిష్పత్తిలో విత్తుకోవచ్చు.
* విత్తే ముందు.. విత్తనానికి సన్నని ఇసుకను 1:3 నిష్పత్తిలో కలుపుకొని వరుసల మధ్య 30 సెం.మీ., మొక్కల మధ్య 10 సెం.మీ. ఎడం ఉండేలా గొర్రుతో విత్తాలి.
ఎరువులు : ఎకరాకు 3-4 టన్నుల మాగిన పశువులు ఎరువుతో పాటు 16 కిలోల యూరియా, 25 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువులను ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. పంట విత్తిన 30-35 రోజుల దశలో 16 కిలోల యూరియాను పైపాటుగా వేయాలి. విత్తిన 30 రోజుల వరకు పంటలో కలుపు లేకుండా చర్యలు చేపట్టాలి.
అగ్గి తెగులు
* గాలిలో అధిక తేమ ఉండి, రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలు ఉండే పరిస్థితులు ఈ తెగులు వ్యాప్తికి అనుకూలం.
* నత్రజనిని అధికంగా వాడే పొలాల్లో.. వర్షపు జల్లులు కురిసే వాతావరణంలో అగ్గితెగులు వ్యాప్తి ఉధృతంగా ఉంటుంది.
* ఎదిగిన మొక్కల ఆకులపై దారపు కండె ఆకారంలో మచ్చలు ఏర్పడతాయి. వీటి చుట్టూ ఎరుపు గోధుమ రంగు అంచులు ఉండి, మధ్యలో బూడిద రంగు ఉంటుంది.
* తెగులు మొక్కల కణుపుల వద్ద సోకితే మొక్క విరిగిపోతుంది.
*మొక్క వెన్ను పైకి తీసే దశలో తెగులు సోకితే వెన్ను దగ్గర నల్లటి రంగు ఏర్పడుతుంది. దీంతో తాలు గింజలు ఏర్పడుతాయి.
నివారణ : తెగులుకు కారణమయ్యే శిలీంద్రం విత్తనాలు, పంట అవశేషాలు, కలుపు మొక్కల ద్వారా వ్యాప్తి చెందుతుంది. మొక్కలపై మచ్చలు కనిపిస్తే లీటరు నీటికి.. గ్రాము కార్బండజిమ్ కలిపి పిచికారీ చేయాలి. నత్రజని ఎరువులను సిఫారసుకు మించి వాడొద్దు.
మరిన్ని

దేవతార్చన
- మదనపల్లె ఘటన:వెలుగులోకి కొత్త విషయాలు
- 30ఏళ్లకు కలిసిన ముగ్గురు అన్నదమ్ములు
- కనిపెంచిన చేతులే.. కాటేశాయి
- పెళ్లి ముచ్చటపై రష్మి-సుధీర్ ఏమన్నారంటే?
- ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందే: సుప్రీం
- ఎన్నికలను రీషెడ్యూల్ చేసిన ఎస్ఈసీ
- వద్దు నాన్నా.. అంటున్నా వినకుండా..!
- పది మంది భార్యలు.. కోట్ల ఆస్తి.. దారుణ హత్య!
- మళ్లీ జయభేరి మోగిస్తున్నా
- చైతన్య ప్రేమ సందేశం.. నిహారిక కన్నీళ్లు