close
వరిలో కలుపు అదుపు!

న్యూస్‌టుడే, ఖానాపురం

వరి సాగులో సకాలంలో కలుపు నివారణ చేపడితే ఖర్చు తగ్గి, దిగుబడి పెరుగుతుంది. ఇందుకోసం చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులను మండల వ్యవసాయాధికారి బోగ శ్రీనివాస్‌ (సెల్‌: 72888 94759) సూచించారు.
*పంట తొలిదశలో ఆరుతడిగా నీరు పారించడం వల్ల కలుపు బాగా పెరుగుతుంది. కలుపు నివారణకు మందులను తప్పనిసరిగా వాడాలి. ఎకరాకు 35 గ్రా. ఆక్సాడయార్జిల్‌ లేదా ప్రిటిలాక్లోర్‌ 400 మి.లీ. 20 కిలోల పొడి ఇసుకలో కలిపి పంట నాటిన 3-5 రోజుల్లో (మొలకలు పచ్చగా తిరిగిన తర్వాత) పలుచగా నీరుపెట్టి చల్లాలి. తర్వాత నీరు తీయకూడదు.
* నాటిన 21-25 రోజుల్లో ఎకరాకు 200 లీటర్ల నీటిలో సైహలోపాప్‌-పి-బ్యుటైల్‌ 250-300 మి.లీ. లేదా ఫెనాక్సా ప్రాప్‌-పి-ఇథైల్‌ పావు లీటరు + అర మి.లీ. సాండోవిట్‌ కలిపి కలిపి పిచికారి చేయాలి.
* వెడల్పాకు గడ్డి నివారణకు.. నాటిన 25-30 రోజులకు ఎకరాకు 2,4-డి సోడియం సాల్ట్‌ 500-600 గ్రా., 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.
* గడ్డిజాతి, వెడల్పాటి జాతి కలుపు మొక్కల నివారణకు ఎకరాకు 100 గ్రా. బిస్‌పైరిబాక్‌ సోడియం 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
* డ్రమ్‌సీడర్‌తో విత్తిన పొలంలో 25 రోజులకు సాళ్ల మధ్య కోనోవీడర్‌ నడపాలి. దీంతో కలుపు బురదలో కలిసిపోతుంది. తదుపరి పది రోజులకోసారి కలుపు ఉన్నా , లేకున్నా కోనోవీడర్‌ నడపాలి. ఇలా చేయడంవల్ల మొక్కలకు గాలి, నీరు సమంగా అంది పీచువేర్లు బాగా విస్తరిస్తాయి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.