close
అలసంద సాగు

న్యూస్‌టుడే, మద్దికెర

లసందను ఫిబ్రవరి మొదటి వారం నుంచి నెలాఖరు వరకు విత్తుకోవచ్చు. తేమను పట్టి ఉంచి, మురుగుపోయే చల్కా, ఎర్ర నేలల్లో సాగు చేయవచ్చు. ఈ పంటలో పాటించాల్సిన మేలైన యాజమాన్య పద్ధతులను పత్తికొండ వ్యవసాయ ఉపసంచాలకులు మహమ్మద్‌ఖాద్రీ (చరవాణి : 88866 13957) సూచించారు.
* ఎకరాకు 8-10 కిలోల విత్తనం సరిపోతుంది. పశుగ్రాసం లేదా పచ్చిరొట్టగా సాగుచేస్తే ఎకరాకు 12-14 కిలోల విత్తనం అవసరం.
* కిలో విత్తనానికి 3 గ్రా. థైరమ్‌ చొప్పున కలిపి తప్పనిసరిగా విత్తనశుద్ధి చేయాలి.
* సాళ్ల మధ్య 30 సెం.మీ, మొక్కల మధ్య 10 సెం.మీ. ఎడం ఉండేలా విత్తాలి.
* పంటకు ముందు ఆఖరి దుక్కిలో ఎకరాకు 2 టన్నుల మాగిన పశువుల ఎరువు, 18 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌ వేసి కలియదున్నాలి.
* కలుపు నివారణకు.. పంట విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు నేలలో తేమ ఉన్నప్పుడు 200 లీటర్ల నీటిలో 1.5 లీటర్ల పెండిమిథాలిన్‌ కలిపి ఎకరా విస్తీర్ణంలో పిచికారీ చేయాలి. అవసరాన్ని బట్టి సాళ్ల దంతెతో అంతరకృషి చేయాలి.
* ఈ పంటను గొంగళి పురుగు, మారుకా మచ్చల పురుగు, పచ్చదోమ, తెల్లదోమలతో పాటు బూడిద, పల్లాకు, ఆకుమచ్చ తెగుళ్లు ఆశిస్తాయి.
* పంట 45 రోజుల దశల్లో పచ్చికాయలు కోతకు వస్తాయి. మూడు రోజులకోసారి కాయలను కోయవచ్చు. ఎకరాకు 30-40 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.
* విత్తనం కోసం పండిస్తే 80-100 రోజులకు కాయలు సిద్ధమవుతాయి.
* ఆకులు ఆకుపచ్చ రంగు నుంచి పసుపు రంగులోకి మారి రాలిపోతాయి. ఈ సమయంలో పంటకోత కోయవచ్చు.


 రకాలు 

* జీసీ-3 : పంటకాలం 90-95 రోజులు. దిగుబడి ఎకరానికి 4-5 క్వింటాళ్లు. స్వల్పకాలికం. గుబురు రకం. పల్లాకు తెగులును తట్టుకుంటుంది.
* వీ-240 : పంటకాలం 90-100 రోజులు. దిగుబడి ఎకరాకు 5-6 క్వింటాళ్లు. పశుగ్రాసానికి అనుకూలం. గింజలు ముదురు ఎరుపు రంగులో ఉంటాయి.
* సీ-152 : పంటకాలం 105-110 రోజులు. దిగుబడి ఎకరాకు 3-4 క్వింటాళ్లు. అంతర పంటగా పండ్ల తోటలకు అనువైన రకం. గింజలు పెద్ద పరిమాణంలో, తెలుపు రంగులో ఉంటాయి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.