close
మాగాణుల్లో అపరాల సాగు!

న్యూస్‌టుడే, మద్దికెర

రికోత అనంతరం తేమను పట్టి ఉంచే అన్ని రకాల నేలల్లో పెసర, మినుములను సాగు చేయవచ్చు. మినుము సాగుకు బరువైన నల్లరేగడి భూములు అత్యంత అనుకూలమని పత్తికొండ వ్యవసాయ ఉపసంచాలకులు మహమ్మద్‌ఖాద్రీ తెలిపారు. వేసవి పంటగా ఫిబ్రవరి నుండి మార్చి 15 వరకు విత్తవచ్చు.

విత్తన మోతాదు: ఎకరానికి 10-12 కిలోల విత్తనం అవసరం. విత్తే ముందు కిలో విత్తనానికి 5 గ్రా. ఇమిడాక్లోప్రిడ్‌ లేదా 5 గ్రా. థయోమిథాక్సిన్‌ కలిపి విత్తనశుద్ధి చేస్తే 15-20 రోజుల వరకు పైరును రసంపీల్చే పురుగుల నుంచి రక్షించుకోవచ్చు. విత్తన సమయంలో సాళ్ల మధ్య 30 సెం.మీ, మొక్కల మధ్య 10 సెం.మీ. ఎడం ఉండేలా విత్తాలి.

ఎరువులు : చివరి దుక్కిలో ఎకరాకు 2 టన్నుల పశువుల ఎరువు వేయాలి. అనంతరం రోటావేటర్‌తో కలియదున్నాలి. ఎకరానికి 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్‌ సూపర్‌ఫాస్ఫేట్‌ లేదా 50 కిలోల డీఏపీ వేయాలి. విత్తిన అనంతరం అవసరం మేరకు పోషకాలను పైపాటుగా పిచికారీ చేయాలి.

సూక్ష్మ పోషక లోపాలు

* జింకు ధాతు లోపం వల్ల ఎదుగుదల లోపించి చిట్టి ఆకులు ఏర్పడతాయి. కనుపుల మధ్య దూరం తగ్గి పూత ఆలస్యమయ్యే ప్రమాదం ఉంటుంది. సవరణకు.. ఎకరాకు 20 కిలోల జింక్‌ సల్ఫేట్‌ ఆఖరి దుక్కిలో వేయాలి. పైరుపై లోపాలు కనిపించగానే లీటరు నీటికి 2 గ్రా. జింక్‌ సల్ఫేట్‌ కలిపి పిచికారి చేయాలి.
* ఇనుము ధాతు లోపం వల్ల లేతాకుల్లో.. ఈనెల మధ్య భాగం పచ్చదనాన్ని కోల్పోయి పసుపు లేదా తెలుపు రంగులోకి మారుతుంది. ఈ పోషక సవరణకు లీటరు నీటికి 5 గ్రా. ఫెర్రస్‌ సల్ఫేట్‌ + ఒక గ్రాము నిమ్మ ఉప్పు కలుపుకుని పైరుపై వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.


కలుపు నివారణ

విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు పెండిమిథాలిన్‌ ఎకరాకు 1.3 లీటర్లు.. 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. పైరు విత్తిన 20 రోజుల్లో వెడల్పాకు కలుపు నివారణ కోసం ఇమజితపిర్‌ 300 మి.లీ. లేదా గడ్డిజాతి కలుపు నివారణకు 400 మి.లీ. క్విజిలాపాప్‌ ఇథైల్‌ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.

 

నీటి యాజమాన్యం : వేసవిలో నీటిపారుదల కింద పండిస్తారు. పూత, కాయ తయారయ్యే దశలు నీటితడికి కీలకమైనవి. కనుక ఈ సమయంలో బెట్ట పరిస్థితి ఏర్పడకుండా తప్పనిసరిగా నీటి తడులు పెట్టాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.