close
సీడ్‌ ప్లాంటర్‌తో సాగు సులువు!

న్యూస్‌టుడే, ఖానాపురం

‘సీడ్‌ ప్లాంటర్‌’ పరికరంతో విత్తనాలను, ఎరువులను ఒకేసారి విత్తుకోవచ్చు. ఈ పరికరాన్ని ఉపయోగించడం ద్వారా రైతులు సమయాన్ని  ఆదా చేసుకోవడంతోపాటు ఖర్చు తగ్గించుకోవచ్చు. సీడ్‌ ప్లాంటర్‌ ఉపయోగాలను ఖానాపురం వ్యవసాయాధికారి శ్రీనివాస్‌ (చరవాణి: 7288894759) తెలిపారు.

ఉపయోగాలు

* మొక్కజొన్న, పత్తి, శనగ, వేరుసెనగ, ఆవాలు తదితర విత్తనాలను విత్తవచ్చు.
* కూలీల కొరతను నివారించి, అదునులో విత్తనాలను విత్తవచ్చు.
* విత్తనాల సైజును బట్టి యంత్రంలో ఉండే పలకలను (ప్లేట్లు) మార్చుకోవాలి.
* మొక్కల మధ్య 8-20 అంగుళాలు, జంట సాళ్ల మధ్య 4 అడుగులు ఎడం ఉండేలా విత్తుకోవచ్చు.
* ఈ పరికరాన్ని మనుషులతో నడిపి, రోజుకు రెండెకరాల వరకు విత్తుకోవచ్చు.
* కేవలం విత్తనం వేసే పరికరం ధర రూ.5 వేలు. విత్తనంతోపాటు ఎరువు వేసే పరికరం ధర రూ.10 వేలు.
* పరికరంలో ఉన్న రెండు వేర్వేరు డబ్బాల్లో ఒకదానిలో విత్తనాలు, మరోదానిలో ఎరువులు వేసి దుక్కిలో ముందుకు నడిపించాలి.
* ఎకరాలో విత్తేందుకు కూలీలకు రూ.1500, ఎరువులు చల్లడానికి రూ.500 ఖర్చవుతుంది. ఈ పరికరాన్ని వినియోగించడం ద్వారా కూలీల కొరతను అధిగమించవచ్చు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.