close
గులాబిలో సస్యరక్షణ

న్యూస్‌టుడే, బొండపల్లి

గులాబిలో సస్యరక్షణ చర్యలను విజయనగరం ఉద్యానశాఖ సంయుక్త సంచాలకులు ఆర్‌. శ్రీనివాసరావు (సెల్‌: 79950 86762) తెలిపారు.


పురుగులు

* పెంకు పురుగులు రాత్రిపూట ఆకులను కొరికి తింటాయి. నివారణకు.. ఎకరానికి మలాథియాన్‌ పొడి 15 కిలోలు సాయంత్రం పూట చేలో చల్లాలి.
* పేనుబంక పురుగులు ఆశిస్తే.. ఆకుల కొనలు, మొగ్గ నల్లగా మారతాయి. నివారణకు లీటరు నీటికి డైమిథోయేట్‌ 1.5 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
* ఎర్రనల్లి నివారణకు లీటరు నీటికి.. నీటిలో కరిగే గంధకం 3 గ్రా. లేదా డైకోఫాల్‌ 3 మి.లీ. కలిపి పిచికారీ చేయాలి.


తెగుళ్లు

బూడిద తెగులు : ఆకులపై బూడిద వంటి పదార్థం ఏర్పడి, ముడుచుకుంటాయి. నివారణకు.. లీటరు నీటికి కార్బండజిమ్‌ ఒక గ్రా. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
నల్లమచ్చలు: ఆకులకు ఇరువైపులా గుండ్రటి నల్లటి మచ్చలు ఏర్పడి ఆకులు రాలిపోతాయి. నివారణకు.. లీటరు నీటికి కార్బండజిమ్‌ ఒక గ్రా. చొప్పున కలిపి మొక్కలపై పిచికారీ చేయాలి.
ఎండురోగం : ఈ తెగులు సోకిన మొక్క పైనుంచి కిందకు ఎండుతుంది. కత్తిరించిన కొమ్మల నుంచి ఇది మొదలవుతుంది. నివారణకు.. కత్తిరించిన భాగంపై బ్లైటాక్స్‌ను పేస్ట్‌లా చేసి పూయాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.