close
జామలో సస్యరక్షణ!

న్యూస్‌టుడే, హాలహర్వి

జామలో చీడపీడల నివారణకు పాటించాల్సిన చర్యలను ఆలూరు క్లస్టర్‌ ఉద్యానశాఖాధికారిణి శ్రీవాణి (చరవాణి: 79950 09819) సూచించారు.


పండు ఈగ: కాయలు పక్వ దశలో ఉన్నప్పుడు ఈగ ప్రభావం అధికంగా ఉంటుంది. నివారణకు.. ప్లాస్టిక్‌ సీసాకు రెండు వైపులా రంధ్రాలు చేసి, అందులో లీటరు నీటికి 2 మి.లీ. మిథైల్‌ యూజినాల్‌ + 3 గ్రా. కార్బోఫ్యూరాన్‌ 3జి గుళికలు కలిపిన ద్రావణాన్ని 200 మి.లీ. చొప్పున పోసి తోటలో అక్కడక్కడ చెట్ల కొమ్మలకు వేలాడదీయాలి. యూజినాల్‌ వాసనకు మగ ఈగలు ఆకర్షితమై మందు ద్రావణంలో పడి చనిపోతాయి. నివారణకు.. లీటరు నీటికి 2 మి.లీ. చొప్పున మలాథియాన్‌ కలిపి తోటపై పిచికారీ చేయాలి. ఈగ ఆశించి రాలిన కాయలను ఏరి నేలలో గుంతతీసి, అందులో వేసి కప్పేయాలి.


పిండినల్లి : చిన్న, పెద్ద పురుగులు కొమ్మల చివర్లను, కాయలను ఆశించి రసాన్ని పీలుస్తాయి. దీంతో ఆకులు, కాయలు రాలిపోతాయి. ఇవి జిగురు పదార్థాన్ని విసర్జించటం వల్ల మసి తెగులు వ్యాప్తి చెందుతుంది. అక్షింతల పురుగు బదనికలు ఈ పురుగులను భక్షించి కొంతమేర వాటిని అదుపుచేస్తాయి. లీటరు నీటికి ఎసిఫేట్‌ 1 గ్రా. లేదా డైక్లోర్‌వాస్‌ 1 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.


తెల్ల సుడిదోమ : వీటి పిల్ల పురుగులు తెల్లని దూది వంటి పదార్థంతో కప్పబడి ఉంటాయి. ఇవి ఆకుల నుంచి రసం పీలుస్తాయి. ఈ పురుగాశించిన ఆకులు ఎర్రబడి ముడతలు పడతాయి. ఫిబ్రవరిలో వీటి తీవ్రత అధికంగా ఉంటుంది. నివారణకు జిగురు పూసిన పసుపురంగు డబ్బాలను చెట్లవద్ద ఉంచాలి. పురుగుల తొలి దశలో.. దోమ ఆశించిన కొమ్మలను కత్తిరించి తొలగించి కాల్చివేయాలి. లీటరు నీటికి వేపనూనె 5 మి.లీ. చొప్పున కలిపి చెట్లపై పిచికారీ చేస్తే వీటి తీవ్రత కొంతమేర తగ్గుతుంది. దోమ ఉద్ధృతి ఎక్కువగా ఉంటే.. లీటరు నీటికి ఒక మి.లీ. డైక్లోరోవాస్‌ కలిపి పిచికారీ చేయాలి.


కాండం తొలిచే పురుగు : ఇది చెట్ల మొదళ్లను తొలుస్తుంది. ఈ పురుగు విసర్జించిన పదార్థం రంధ్రాల్లో నిండి ఉంటుంది. ఈ రంధ్రాల్లోకి ఇనుప చువ్వను చొప్పించి, పురుగును చంపి, మొదలును శుభ్రం చేయాలి. ఈ రంధ్రాల్లో పెట్రోల్‌ లేదా కిరోసిన్‌ తడిపిన దూదిని ఉంచాలి లేదా రంధ్రాల్లో కార్బోఫ్యూరాన్‌ గుళికలను వేసి రేగడి మట్టితో పూడ్చాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.