close
పూల తోటల్లో ప్రస్తుత చర్యలు

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌

పూల తోటల్లో రైతులు మేలైన దిగుబడులు సాధించడానికి సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సంగారెడ్డి జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి సునీత (చరవాణి: 79977 25264) తెలిపారు.

గులాబి : ప్రస్తుతం తోటలు పూత దశలో ఉన్నాయి. దూర ప్రాంత మార్కెట్లకు తరలించాలంటే మొగ్గ దశలో ఉన్నప్పుడే కోయాలి. సమీప మార్కెట్‌కైతే పూలలో ఒక వరుస రేకులు విచ్చుకున్నప్పుడే కోయాలి. పూల కోత తర్వాత కాడలను 15-20 సెం.మీ. కిందికి కత్తిరించాలి. మెలిపడిన కొమ్మలను పూర్తిగా తొలగించాలి. కత్తిరింపుల తర్వాత తోటలో ఎండు తెగులు ఆశించకుండా లీటరు నీటికి 3 గ్రా. బ్లైటాక్స్‌ కలిపి పిచికారీ చేయాలి.

చామంతి : ప్రస్తుతం కోతకు వచ్చే తోటల్లో.. పూల సైజు పెరిగేందుకు పైపాటు ఎరువులు వేసిన తర్వాత లీటరు నీటికి 2 గ్రా. చొప్పున సూక్ష్మపోషకాల మిశ్రమం కలిపి 15 రోజులకోసారి పిచికారీ చేయాలి. పూల కోత తర్వాత మొక్కలను నేలకు దగ్గరగా కత్తిరించి నత్రజని, భాస్వరం ఎరువులు వేయడం ద్వారా పిలకలు బాగా పెరుగుతాయి.

కనకాంబరం : ఏడాది పొడవునా వీటి నుంచి దిగుబడి వస్తుంది. ఎకరాకు 20 కిలోల యూరియాను పైపాటుగా వేయాలి. ఇనుపధాతు లోప నివారణకు లీటరు నీటికి 5 గ్రా. ఫెర్రస్‌ + 20 గ్రా. యూరియా చొప్పున కలిపి పిచికారీ చేయాలి.

లిల్లీ : పంట నాటిన 20 వారాలు పూర్తయిన తర్వాత 40 వారాల వరకు 4-5 రోజులకోసారి ఎకరాకు.. కిలో చొప్పున 19:19:19, 13:0:45 ఎరువులు అరకిలో యూరియాను బిందుసేద్యం ద్వారా (ఫెర్టిగేషన్‌) మొక్కలకు అందించాలి. దీనివల్ల పూల నాణ్యత, దిగుబడి పెరుగుతుంది. పేనుబంక లేదా తామర పురుగులు కనిపిస్తే పది లీటర్ల నీటికి 20 మి.లీ. డైమిథోయేట్‌ లేదా ఇమిడాక్లోప్రిడ్‌ 4 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.