close
అంతర పంటలతో అధికాదాయం!

- న్యూస్‌టుడే, దొర్నిపాడు

లాభసాటి వ్యవసాయానికి అంతర పంటలు దోహదం చేస్తాయని దొర్నిపాడు వ్యవసాయాధికారి కల్యాణ్‌కుమార్‌ తెలిపారు. అనువైన అంతర పంటలను ఎంపికచేసి సాగు చేయడం ద్వారా గరిష్ఠ ప్రయోజనం పొందవచ్చని తెలిపారు.
* నేలలో వివిధ లోతుల్లో నుంచి పోషకాలను గ్రహించే వేరు వ్యవస్థ ఉన్న పంటలనే అంతర పంటలుగా సాగుచేయాలి.  
* ఎంపిక చేసే అంతరపంట.. ప్రధాన పంట దిగుబడిని పెంచే విధంగా ఉండాలి కానీ పోషకాలు, నీరు, వెలుతురు విషయంలో ప్రధాన పంటతో పోటీ పడకూడదు.
* ప్రధాన పంట దీర్ఘకాలికం, అంతరపంట స్వల్పకాలికంగా ఉండేలా ఎంపికచేస్తే.. పంట కీలక దశల్లో రెండు పైర్ల మధ్య పోటీ ఉండదు.
* ఆయా పంటల పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని.. ప్రధాన, అంతర పంటలను వివిధ అంతస్తుల్లో పెంచవచ్చు.  
* ప్రధాన పంటను ఆశ్రయించే చీడపీడలను అంతర పంటలు నిలువరించేలా ఉండాలి.
* సీజన్‌లో ఒకే పంటను సాగు చేస్తే.. ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలు దాడి చేసినప్పుడు, రైతుకు  నష్టం అధికంగా ఉంటుంది. అంతర పంటలను విత్తినప్పుడు.. ఒక పంటకు నష్టం వాటిల్లినా, రెండో పంట ద్వారా రైతు కోలుకునే అవకాశం ఉంటుంది.
* అంతర పంటలను సాగుచేసే ముందు రైతులు వ్యవసాయాధికారులను సంప్రదించి సలహాలు పొందితే.. అధిక ప్రయోజనం ఉంటుంది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.