close
ఇప్పుడు సజ్జను విత్తొచ్చు!

రబీలో ఆరుతడి పంటగా జనవరి ఆఖరు నుంచి  ఫిబ్రవరి మొదటి వారం వరకు సజ్జను విత్తవచ్చని బనగానపల్లి కేవీకే శాస్త్రవేత్త సుధాకర్‌ (సెల్‌: 94407 39378)  తెలిపారు.  
- న్యూస్‌టుడే, బనగానపల్లి
రకాలు  
హెచ్‌.హెచ్‌.బి-67 (హైబ్రీడ్‌) : పంటకాలం 68-70 రోజులు. ఎకరానికి 8-10 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. తక్కువ కాలంలో కోతకువస్తుంది.
ఐ.సి.ఎం.హెచ్‌-356 (హైబ్రీడ్‌) : పంటకాలం 80-85 రోజులు. ఎకరాకు 10-12 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. గింజలు మధ్యస్థంగా, బూడిదరంగులో ఉంటాయి.  
ఆర్‌.హెచ్‌.బి-121 (హైబ్రీడ్‌) : పంటకాలం 80-85 రోజులు. ఎకరానికి 12-14 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది.  
ఐ.సి.టి.పి-8203 (కాంపోజిట్‌) : పంటకాలం 80-85 రోజులు. ఎకరానికి 8-10 క్వింటాü్లŒ దిగుబడినిస్తుంది. గింజలు లావుగా, తెల్లగా ఉంటాయి. బెట్టను తట్టుకుంటుంది.
ఐ.సి.ఎం.వి-221 ( కాంపోజిట్‌) : పంటకాలం 85-90 రోజులు. ఎకరాకు 8-10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. వెర్రికంకి తెగులు తట్టుకుంటుంది. డబ్ల్యూసీసీ-75 రకం కంటే మేలైనది. పైన పేర్కొన్న అన్ని రకాలు వెర్రికంకి తెగులును తట్టుకుంటాయి.
విత్తనం: ఎకరాకు 1.6 కిలోలు సరిపోతుంది. విత్తేముందు లీటరు నీటికి 20 గ్రా. చొప్పున ఉప్పు కలిపిన ద్రావణంలో.. 20 గ్రా. విత్తనాన్ని 10 నిముషాలపాటు ఉంచాలి. ఆరిన తర్వాత కిలో విత్తనానికి 3 గ్రా. థైరమ్‌ కలిపి శుద్ధి చేయాలి. వరుసల మధ్య 45 సెం.మీ. మొక్కల మధ్య 12-15 సెం.మీ. ఎడం ఉండేలా గొర్రుతో విత్తాలి లేదా 15 రోజుల వయసున్న నారును గింజలు విత్తే ఎడంలోనే నాటాలి.

ఎరువులు
ఆఖరు దుక్కిలో ఎకరానికి 4 టన్నుల మాగిన పశువుల ఎరువు వేయాలి. ఎకరాకు 70 కిలోలు యూరియా, 100 కిలోలు సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌, 20 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ వేయాలి. యూరియాను రెండు సమపాళ్లుగా చేసి విత్తేముందు సగం, విత్తిన 30 రోజులకు మరో సగం వేయాలి.
* పంట 30 రోజుల దశలో ఎకరాకు 2 టన్నుల వేరుసెనగ పొట్టును నేలపై పరచడం ద్వారా భూమిలో తేమ నిలుస్తుంది. పంట అంకుర, పూత, గింజ పాలు పోసుకునే దశ, గింజ గట్టిపడే దశల్లో నీటితడులను తప్పక ఇవ్వాలి.
* పంట విత్తిన వెంటనే లేదా 2 రోజుల్లో ఎకరాకు అట్రజిన్‌ (50 శాతం) పొడిమందు 600 గ్రా., 200 లీటర్ల నీటిలో కలిపి తడినేలపై పిచికారీ చేయాలి. విత్తిన రెండు వారాల్లోపు ఒత్తు మొక్కలను పీకేయాలి. పంట 25-30 రోజుల దశలో గుంటక లేదా దంతితో అంతరకృషి చేయాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.