close
చెరకు సాగు గిట్టుబాటుకు యాంత్రీకరణ

పంట పండించే రైతుకు, వినియోగదారుకు మధ్య దళారీ వ్యవస్థలుండటంతో వ్యవసాయం గిట్టుబాటుగా లేదని రైతులు మదనపడుతున్నారు. వ్యవసాయ ఖర్చులు, పెట్టుబడులు పెట్టి పండించిన పంటలను అయినకాడికి అమ్ముకోవడం తప్ప గత్యంతరం లేని పరిస్థితులున్నాయి. కానీ చెరకు రైతుల పరిస్థితి దీనికి భిన్నంగా ఉండేది. చక్కెర ఫ్యాక్టరీలకు రైతు చెరకు గడలను తోలి వాటి తూకానికి ప్రతిఫలం పొందేవారు. దళారులకు తావు ఉండేది కాదు. చక్కెర ధరల ఆధారంగా పంచదార మిల్లులు ప్రస్తుతం రైతులకు గిట్టుబాటు ధరలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాయి. అయినా చక్కెర లేకుండా సామాన్యుడికి పూట గడవదు. అందువల్ల రైతులు చెరకు సాగులో ఖర్చులు తగ్గించుకోవాల్సిన పరిస్థితులున్నాయి. కూలీ రేట్లు పెరిగిపోవటం, చెరకు నాటడం, నరకటం మిల్లులోకి తోలకం లాంటి పనులు ఖర్చుతో కూడుకోవడంతో చెరకు సాగు గిట్టుబాటు కావడం లేదని ప్రచారంలో ఉంది.  
వ్యవసాయ ఖర్చులు తగ్గించుకుంటే వ్యవసాయం గిట్టుబాటవుతుందని అందరికీ తెలిసిందే. ఖర్చులు తగ్గించుకునే మార్గాల్లో ముఖ్యమైనది యాంత్రీకరణ. యంత్రాలతో వ్యవసాయం త్వరితంగానూ, చౌకగాను జరుగుతుంది. కూలీ ఖర్చుల్లో నాలుగో వంతులోనే పని పూర్తవుతుంది. ప్రస్తుతం చెరకు బోదెల ఏర్పాట్లు, విత్తన గడలను ముచ్చెలుగా చేయడం, వాటిని చేలో పరచడం లాంటి పనులన్నీ యంత్రం ద్వారా చేయవచ్చు. ఇద్దరు కూలీలతో ముచ్చెలను నాలుగెకరాల్లో పరచవచ్చు. అలాగే ముచ్చెలు పరిచే కూలీలు కూర్చునే దానికి అడుగు నుంచి రసాయన ఎరువులను సాళ్ళలో వేసుకోవచ్చు. ఈ పనులన్నీ యంత్రం ద్వారా ఒకే సమయంలో నిర్వహించవచ్చు. చెరకు తయారైనప్పుడు నరికే యంత్రం వాడవచ్చు. ఒకసారి నాటిన చెరకు పంట రెండు, మూడు సీజన్లు కొట్టకం జరుగుతూ ఉంటుంది. దీనినే ‘రెటూన్‌’ అంటారు. రెటూన్‌ చేయటానికి నేల మట్టానికి చెరకు గడలు నరికి ట్రిమ్మింగ్‌ చేయాలి. వీటికి రెటూన్‌ మ్యానేజర్లు వచ్చాయి. ఒకేరోజు నాలుగు ఎకరాల్లో యంత్రంతో రెటూన్‌ చేయవచ్చు. వీటికి కావల్సిన యంత్రాల ఖరీదు రైతులకు అందుబాటులో ఉండవు కనుక, చెక్కర మిల్లులు గ్రామానికి ఒక్కో యంత్రం చొప్పున ఏర్పాటు చేయవచ్చు లేదా రైతులే సంఘంగా ఏర్పడి యంత్రాలను కొని సాగు చేసుకోవచ్చు. చెరకు విత్తనం వేసిన దగ్గర నుంచి మిల్లుకు గడలు చేరే వరకు అన్ని పనులు యంత్రాల ద్వారా చేసుకునే వీలున్నందున చెరకు రైతుల పంచదార మిల్లులు వీటిని ఉపయోగంలోకి తెచ్చే ఏర్పాటు చేసుకుని చెరకు సాగు గిట్టుబాటు గాను, చెక్కర మిల్లులు లాభసాటిగాను వర్ధిల్లేందుకు ప్రయత్నించాలి.

- డాక్టర్‌ మొవ్వ రామారావు

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.