close
వరిలో అగ్గి తెగులు

రబీలో సాగు చేసిన వరిని అగ్గి తెగులు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది. పైరుపై ఈ తెగులు లక్షణాలను సకాలంలో గుర్తించి, నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ జే.హేమంత్‌కుమార్‌ (సెల్‌ : 99896 23831) శాస్త్రవేత్తలు డాక్టర్‌ కె.రవికుమార్‌, పి.శ్రీరంజిత తెలిపారు.
తెగులు లక్షణాలు: పైరు తొలిదశలో ఆకులపై నూలు కండె ఆకారంలో మచ్చలు ఏర్పడతాయి. మచ్చల మధ్యభాగం బూడిద లేదా తెలుపు రంగులో ఉంటుంది. ఈ ఆకులు క్రమంగా ఎండి, పంట కాలినట్లు కనిపిస్తుంది. పంట పిలక దశలో మచ్చలు కణుపులకు వ్యాపిస్తాయి. దీంతో కణుపులు కుళ్లిపోతాయి.
నివారణ: పంటపై తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే పది లీటర్ల నీటికి ట్రైసైక్లజోల్‌ 6 గ్రా. లేదా కాసుగామైసిన్‌ 25 మి.లీ. చొప్పున కలిపి తెగులు ఉద్ధృతిని బట్టి 10-15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.

- న్యూస్‌టుడే, ఖమ్మం (వ్యవసాయం)

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.