close
జొన్నలో కలుపు అదుపు

జొన్న పంట తొలిదశలో కలుపు నివారణ చర్యలను గుంటూరు లాంఫారం, ఏరువాక శాస్త్రవేత్త ఈదర వెంకటేశ్వర్లు (సెల్‌ : 98498 65759) సూచించారు.  
* పంట విత్తిన 45 రోజుల వరకు కలుపు సమస్య ఉంటుంది. ఆ తర్వాత పైరు పెరిగి సాళ్ల మధ్య కమ్ముకొని కలుపు సమస్య ఉండదు.  

* పంట విత్తిన 20-30 రోజులకు చెంచలాకు, గలిజేరు, చిట్టిచామంతి, వయ్యారిభామ, చిలక తోటకూర, నానబాలు, అటికమామిడి, గునుగు, లింగమిరియాలు, ఆమడకాయ వంటి వెడల్పాకు, తుంగ కలుపు నివారణకు ఎకరానికి 2,4-డి సోడియం సాల్ట్‌ 80 శాతం (ఫెర్నాక్సోస్‌, సావిక్స్‌) 400 గ్రా. లేదా 2,4-డి ఎమైన్‌ సాల్ట్‌ (వీడ్‌మార్‌ సూపర్‌, డ్యూరా) 400 మి.లీ. హ్యాండ్‌ స్ప్రేయర్‌తో 200 లీటర్ల నీరు లేదా తైవాన్‌ స్ప్రేయరైతే 120 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.  
* గరిక, ఊద, ఉర్రంకి, చిప్పెర, పుల్లఎరుపు, ఇతర గడ్డిజాతి కలుపు నివారణకు ఎటువంటి మందులు అందుబాటులో లేవు.
గమనిక : మొక్కజొన్నలో పెరిగే గరిక, ఊద, ఉర్రంకి, చిప్పెర, పుల్లఎరుపు కలుపు నివారణకు ఉపయోగించే లాడిస్‌, టింజర్‌ మందులను జొన్నలో ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు.

- న్యూస్‌టుడే, వినుకొండ

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.