close
పురుగుతోనే పురుగు అదుపు!

డైమండ్‌బాక్‌ మాత్‌.. ఇది కాలిఫ్లవర్‌, క్యాబేజి, బ్రకోలి వంటి పంటల్లో వినాశనకరమైన చీడగా చెప్పవచ్చు. అనేక రకాల పురుగు మందులకు నిరోధకతను పెంచుకుని శాస్త్రవేత్తలకు సవాలు విసురుతోంది. ఈ పురుగాశించిన ప్రాంతాల్లో రైతులు కొన్నిసార్లు పంటనే తీసేస్తుంటారు. చైనాలో రైతులకు ఈ పురుగు సమస్యాత్మకంగా మారింది. ఈ ఒక్క పురుగు వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 4-5 బిలియన్‌ డాలర్ల నష్టం కలుగుతుందని అంచనా. దీని నివారణకు ఇటీవల శాస్త్రవేత్తలు జన్యు ఇంజినీరింగ్‌ చేసిన  మగ పురుగును అభివృద్ధి చేశారు. ఫలితంగా ఈ పురుగులు ఆడ మాత్‌లతో కలిసినప్పుడు వచ్చే సంతానంలోని ఆడ పురుగులు లార్వా దశలోనే చనిపోతాయి. మగ పురుగుల్లో మందుల నిరోధకత తగ్గుతుంది. ఇలా జన్యుపరంగా మార్పిడిచేసిన పురుగులు వాటంతట అవే చనిపోతాయి. ఇలా పర్యావరణానికి హాని లేకుండానే ఈ చీడల సంతతి క్షీణిస్తుంది.

- రైతేరాజు డెస్క్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.