close
పైర్లలో ప్రస్తుత చర్యలు

రబీలో సాగుచేసిన పైర్లలో ఈ తరుణంలో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలను జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనస్థానం సహ పరిశోధన సంచాలకులు డాక్టర్‌ ఆర్‌.ఉమారెడ్డి  (చరవాణి: 99896 25213) తెలిపారు.

 

వరిలో కాండం తొలుచు పురుగు, ఆకుముడత ఆశిస్తోంది. వీటి నివారణకు 10 లీటర్ల నీటికి కార్టాఫ్‌ హైడ్రోక్లోరైడ్‌ 20 గ్రా. లేదా క్లోరాంత్రనిలిప్రోల్‌ 3 మి.లీ. చొప్పున పిచికారీ చేయాలి. వరిలో ఈగ నివారణకు.. లీటరు నీటికి 1.6 మి.లీ. మోనోక్రోటోఫాస్‌ కలిపి పిచికారీ చేయాలి. చలివల్ల తలెత్తే జింకు లోప సవరణకు లీటరు నీటికి 2 గ్రా. జింక్‌సల్ఫేట్‌ కలిపి 5 రోజుల వ్యవధిలో రెండుసార్లు పైరుపై పిచికారీ చేయాలి.
* పత్తి పంటను వేసవి వరకు ఉంచితే.. గులాబి పురుగు జీవితచక్రం కొనసాగి, ఖరీఫ్‌ పత్తి పంటపై ఈ పురుగు దాడి పెరుగుతుంది. నీటివసతి ఉంటే.. పత్తిని తీసేసి, ఫిబ్రవరిలో నువ్వు విత్తవచ్చు.
* ఆవాలు పంటలో పేనుబంక నివారణకు పది లీటర్ల నీటికి ఎసిటామప్రిడ్‌ 2 గ్రా. చొప్పున కలిపి పైరుపై పిచికారీ చేయాలి. తెల్లతుప్పు తెగులు ఆశిస్తే.. లీటరు నీటికి ప్రొపికొనజోల్‌ 1 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
* శనగలో పచ్చపురుగు నివారణకు 10 లీటర్ల నీటికి స్పైనోసాడ్‌ 3 మి.లీ లేదా ఎమామెక్టిన్‌ బెంజోయేట్‌ 4 గ్రా. లేదా క్లోరాంత్రనిలిప్రోల్‌ 3 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి. రబ్బరు పురుగు నివారణకు లీటరు నీటికి క్వినాల్‌ఫాస్‌ 2 మి.లీ. లేదా క్లోరిఫైరిఫాస్‌ 2.5 మి.లీ. లేదా నోవాల్యురాన్‌ 1 మి.లీ. వంతున కలిపి పిచికారీ చేయాలి.
* జొన్నను ఆశించే గింజబూజు తెగులు నివారణకు లీటరు నీటికి ప్రొపికొనజోల్‌ 1 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.

- న్యూస్‌టుడే, జగిత్యాల (వ్యవసాయం)


* వేరుసెనగలో ఆకుముడత నివారణకు లీటరు నీటికి.. క్వినాల్‌ఫాస్‌ 2 మి.లీ. లేదా క్లోరిపైరిఫాస్‌ 2 మి.లీ. లేదా ఎసిఫేట్‌ 1 గ్రాము చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగులు నివారణకు లీటరు నీటికి హెక్సాకొనజోల్‌ 2 మి.లీ. లేదా మాంకోజెబ్‌ 2 గ్రా., కలిపి పైరుపై పిచికారీ చేయాలి.

* కందిలో కాయతొలుచు పురుగుల నివారణకు  ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను పెట్టి పురుగు  ఉద్ధృతిని గమనించాలి. ఎకరాకు 20 పక్షి స్థావరాలను (పంగలి కర్రలు) ఏర్పాటు చేయాలి. పురుగు నివారణకు 10 లీటర్ల నీటికి క్లోరాంత్రనిలిప్రోల్‌ 3 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.

* మొక్కజొన్న పూతదశలో ఎకరాకు 50 కిలోల యూరియా, 25 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌లను పైపాటుగా వేయాలి. కాండం తొలుచు పురుగు నివారణకు 10 లీటర్ల నీటికి మోనోక్రోటోఫాస్‌ 16 మి.లీ. లేదా క్లోరాంత్రనిలిప్రోల్‌ 3 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి. కత్తెర పురుగు నివారణకు 10 లీటర్ల నీటికి ఎమామెక్టిన్‌ బెంజోయేట్‌  4 గ్రా. లేదా క్లోరాంత్రనిలిప్రోల్‌  3 మి.లీ. వంతున కలిపి పిచికారీ చేయాలి. పైరు 25-30 రోజుల దశలో కార్బోఫ్యూరాన్‌ 3జి గుళికలను ఎకరాకు 3-4 కిలోల చొప్పున మొవ్వులో వేయాలి.  ఆకుఎండు, తుప్పు తెగులు నివారణకు లీటరు నీటికి మాంకోజెబ్‌ 2.5 గ్రా. కలిపి పిచికారీ చేయాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.