
గత ఐదేళ్లలో పశుసంవర్థక రంగంలో సగటు వృద్ధిరేటు 8 శాతంగా నమోదైంది. రైతుల ఆదాయం పెంపుదలకు, ఉపాధి కల్పనకు, ఆహార భద్రతకు ఈ రంగం ఎంతగానో దోహదపడుతోంది. కేంద్ర ప్రభుత్వం 2022 నాటికి పశు పోషకుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు, 5.35 కోట్ల టన్నులుగా ఉన్న ప్రస్తుత పాలశుద్ధి సామర్థ్యాన్ని 10.8 కోట్ల టన్నులకు పెంచనుంది. ఇందుకోసం 2020 బడ్జెట్లో ఈ రంగానికి రూ.3289 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోల్చితే ఇది 18 శాతం అధికం.
పాల దిగుబడిని ప్రభావితం చేసే గాలికుంటు వ్యాధి, బ్రూసెల్లోసిస్ వంటి వ్యాధుల్ని దేశం నుంచి పారదోలేందుకు ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ఈ చర్యల ద్వారా 10-15 శాతం మేర అధిక పాల దిగుబడులు సాధించాలని సంకల్పించారు. ప్రస్తుతం 30 శాతం పశువులకు మాత్రమే కృత్రిమ గర్భోత్పత్తి చేస్తున్నారు. దీన్ని 70 శాతానికి పెంచేలా చర్యలు చేపట్టనున్నారు. ఫలితంగా మేలైన పశుసంతతి వృద్ధి చెంది, అధిక పాల దిగుబడులు లభిస్తాయి.
* పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో పెద్దెత్తున ‘సెక్స్డ్ వీర్యం’ (కోరుకున్న విధంగా ఆడ లేదా మగ దూడను పొందగలిగే సాంకేతిక) వినియోగం, వీధి పశువుల సమస్యను పరిష్కరించడం.. వంటివి అమలు చేయనున్నారు.
* పాలు, మాంసం, చేపలు వంటి త్వరగా పాడయ్యే స్వభావమున్న ఉత్పత్తులను అధికంగా ఉత్పత్తయ్యే ప్రాంతాల నుంచి కొరత ఉన్న ప్రాంతాలకు వేగంగా, సురక్షితంగా రవాణా చేసేందుకు వీలుగా ‘కిసాన్ రైళ్ల’ను ప్రవేశపెట్టనున్నారు.
* ఈ కార్యక్రమాలు పశుపోషణపై ఆధారపడ్డ రైతాంగం ఆర్థిక అభ్యున్నతికి దోహదపడతాయని ఆశిద్దాం.
* ఉపాధిహామి పథకం కింద పశుగ్రాస క్షేత్రాల్ని అభివృద్ధి చేస్తారు. తద్వారా గ్రామాల్లో పశుసంతతికి గ్రాసం లభ్యత పెరిగి, పాల ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుంది.
* ఈ కార్యక్రమాల ద్వారా పశు సంతతి పెరిగి, వాటి ద్వారా లభించే పేడ తదితర సేంద్రియ ఎరువులు నేలలో సేంద్రియ కర్బనాన్ని పెంచుతాయి. ఫలితంగా భూసారం పెరిగి, రసాయన ఎరువుల వాడకం తగ్గి, ఆ మేరకు రైతులకు ఖర్చు తగ్గుతుంది. పశుగ్రాస క్షేత్రాల వృద్ధి వల్ల సహజ పచ్చిక బయళ్లు అందుబాటులోకి వచ్చి, పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది.
మరిన్ని

దేవతార్చన
- మదనపల్లె ఘటన:వెలుగులోకి కొత్త విషయాలు
- 30ఏళ్లకు కలిసిన ముగ్గురు అన్నదమ్ములు
- కనిపెంచిన చేతులే.. కాటేశాయి
- పెళ్లి ముచ్చటపై రష్మి-సుధీర్ ఏమన్నారంటే?
- ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందే: సుప్రీం
- ఎన్నికలను రీషెడ్యూల్ చేసిన ఎస్ఈసీ
- వద్దు నాన్నా.. అంటున్నా వినకుండా..!
- పది మంది భార్యలు.. కోట్ల ఆస్తి.. దారుణ హత్య!
- మళ్లీ జయభేరి మోగిస్తున్నా
- చైతన్య ప్రేమ సందేశం.. నిహారిక కన్నీళ్లు