close
సేంద్రియ ఉత్పత్తుల ఎగుమతి పెరగాలి!

రైతు పండించే పంటలకు ప్రస్తుత పరిస్థితుల్లో సరైన ఆదాయం రావడం లేదనేది వాస్తవం. వ్యవసాయోత్పత్తుల ధరల నిర్ణయంలో ప్రభుత్వ ఉదాసీనతతో పాటు దళారుల బాధ అధికమవుతోంది. దేశం నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు కూడా కష్టాల్లో ఉన్నాయి. వీటిలో నాణ్యతా పరమైన ఇబ్బందులు ఉండటం వల్ల భారత్‌ నుంచి ఎగుమతులు నిరాదరణకు గురవుతున్నాయి. రసాయనాలు వాడని సేంద్రియ ఉత్పత్తులకు విదేశాల్లో గిరాకీ ఉంది. ఈ అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని ఎగుమతులకు ఉద్దేశించిన వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యత ప్రమాణాలు, సేంద్రియ ఉత్పత్తుల ఎగుమతికి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. భారత ప్రభుత్వం వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు ఏడాదికి వంద బిలియన్‌ డాలర్ల మేర సంకల్పించింది. దీనికి ఎగుమతికి ముందే సర్టిఫికేట్‌ సంపాదించి ఎగుమతులు నిరాకరించబడకుండా మార్గమేర్పరిచింది. ఈ సర్టిఫికేటు దిగుమతి చేసుకునే దేశ అవసరాలను ప్రతిబింభిస్తుంది. నాణ్యత గల వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో ముఖ్యంగా ఆహార పదార్థాలు విదేశాలకు ఎగుమతి చేసేందుకు జాగ్రత్తలు అవసరం.

ఆహార వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్‌, వ్యవసాయ ఎగుమతులు, రైతుల ఆదాయం పెంచడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. అధికంగా ఉన్న ఆహార పదార్థాల వృథాను అరికట్టాల్సి ఉంది. అధిక జనాభా గల దేశంలో ఆహార పదార్థాలను వృథా చేయలేం. ఆహార పదార్థాల ప్రాసెసింగ్‌ వ్యవసాయానికి చేదోడుగా ఉండి, ధరల సంక్షోభాలు రాకుండా కాపాడుతుంది. రైతుల రాబడులు పెరగడానికి జాతీయ ఆహార ప్రాసెసింగ్‌ చేపట్టాలని ఆహార ప్రాసెసింగ్‌ మంత్రిత్వశాఖ ప్రభుత్వాన్ని కోరింది. కొత్తగా ఆహార ప్రాసెసింగ్‌ యూనిట్లు నెలకొల్పేందుకు నాబార్డ్‌ రూ.రెండు వేల కోట్లు కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేసింది. సముద్ర ఉత్పత్తులైన చేపలు, రొయ్యల ప్రాసెసింగ్‌కు, శీతల గిడ్డంగుల ఏర్పాటుకు, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్‌ సమూహల ఏర్పాటుకు, ఆహార ప్రాసెసింగ్‌ కేంద్రాలను నెలకొల్పేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ కార్యక్రమాలు సాకారమైతే, వ్యవసాయం గిట్టుబాటై, రాబడులు ద్విగుణీకృతమవుతాయని ఆశించవచ్చు.

- డాక్టర్‌ మొవ్వ రామారావు (సెల్‌: 80085 95348)

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.