close
సజ్జలో చీడల అదుపు

న్యూస్‌టుడే, హాలహర్వి

సజ్జలో సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా వేసవిలోను అధిక దిగుబడి సాధించవచ్చని హాలహర్వి మండల వ్యవసాయాధికారి రూఫస్‌ రొనాల్డ్‌ (సెల్‌ : 88866 13955) తెలిపారు.
కత్తెర పురుగు
మొక్కజొన్నలో సమస్యాత్మకంగా మారిన ఈ లద్దె పురుగు సజ్జను కూడా ఆశించి అధిక నష్టం కలిగిస్తుంది. ఇది ఆకులను, కాండాన్ని, పత్రహరితాన్ని గోకి తినడం వల్ల ఆకులపై తెల్లటి పొర ఏర్పడుతుంది. రెండు, మూడో దశకు చేరిన లద్దె పురుగులు ఆకు
సుడిలో ఉండి రంధ్రాలు చేస్తూ తినడం వల్ల విచ్చుకున్న ఆకుల్లో రంధ్రాలు ఏర్పడుతాయి. లద్దె పురుగు పెరుగుతున్న కొద్ది.. ఆకులను పూర్తిగా కత్తిరించినట్టు తింటుంది. కొన్ని సందర్భాల్లో మొవ్వును తింటుంది. దీంతో మొక్క కురచగా మారి, కంకి ఏర్పడదు.  

పచ్చకంకి/ వెర్రికంకి తెగులు: ఈ తెగులు సోకిన కాండంపై పూర్తిగా లేదా అసంపూర్తిగా ఆకులుగా మారిన పుష్పగుచ్ఛం ఏర్పడుతుంది. తెగులు లక్షణాలు మొదట లేత మొక్కలపై 3-4 ఆకులు వేసే దశలో కనిపిస్తాయి. తెగులు సోకిన మొక్కల ఆకులు పసుపు రంగుకు మారుతాయి. గాలిలో తేమ అధికంగా ఉన్న వాతావరణంలో ఆకుల అడుగున తెల్లని బూజు పెరుగుదల కనిపిస్తుంది. తెగులు తీవ్రదశలో మొక్కలు గిడసబారి 30 రోజుల్లోపు చనిపోతాయి. కంకులు పూర్తిగా లేదా పాక్షికంగా ఆకుల మాదిరిగా మారిపోతాయి. వ్యాధి సోకిన మొక్కలను ఏరి కాల్చేయాలి. విత్తిన 21 రోజులకు.. చేలో తెగులు సోకిన మొక్కలు 5 శాతం మించి ఉంటే.. లీటరు నీటికి రిడోమిల్‌ (25 డబ్ల్యూపీ) ఒక గ్రా. వంతున కలిపి పిచికారీ చేయాలి.
నివారణకు.. ఆకులపై పురుగు గుడ్ల సముదాయాలను ఏరి నాశనం చేయాలి. పిల్ల పురుగులతో ఉన్న ఆకులను ఏరి కాల్చేయాలి. ఎకరానికి 10 లింగాకర్షక బుట్టలను అమర్చాలి.  
పురుగు గుడ్లను, పిల్ల పురుగులను నివారించేందుకు.. లీటరు నీటికి 5 మి.లీ. వేపనూనె కలిపి పిచికారీ చేయాలి.  
మొదటి దశ లార్వాలను నివారించేందుకు.. ఎకరాకు (200 లీటర్ల నీటిలో) క్లోరిపైరిఫాస్‌ (25 ఇ.సి.) 400 మి.లీ. లేదా క్వినాల్‌ఫాస్‌ (25 ఇ.సి.) 400 మి.లీ. కలిపి మొక్కల సుడిలో పిచికారీ చేయాలి.
పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఎకరానికి (200 లీటర్ల నీటిలో) ఇమామెక్టిన్‌ బెంజోయేట్‌ (5 ఎస్‌.జి.) 80 గ్రా. లేదా స్పైనోశాడ్‌ (45 ఎస్‌.ఇ.) 60 మి.లీ., కలిపి పిచికారీ చేయాలి.
మందులు పిచికారీ చేసేటప్పుడు ఆకులపైనే కాకుండా సుడి/మొవ్వులోని ఆకులు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి.
10 కిలోలు తవుడు, రెండు కిలోల బెల్లం, రెండు లీటర్ల నీటిలో 24 గంటల పాటు పులియబెట్టి, తరువాత 100 గ్రా. థయోడికార్బ్‌ కలిపి, విషపు ఎరను తయారు చేసి సాయంత్రం వేళ మొక్కల సుడిలో వేయాలి

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.